Monday, July 1, 2024
HomeTrending Newsపార్లమెంటులో నీట్ పేపర్ లీకేజీ ప్రకంపనలు

పార్లమెంటులో నీట్ పేపర్ లీకేజీ ప్రకంపనలు

నీట్ పరీక్షలో అవకతవకలు పార్లమెంటు ఉభయసభలను స్తంభింప చేశాయి. నీట్ ప‌రీక్ష పేప‌ర్ లీకేజీ ఘ‌ట‌న‌పై ఉభయసభల్లో దుమారం రేగింది. రాష్ట్ర‌ప‌తి ప్ర‌సంగానికి ధ‌న్య‌వాద తీర్మానంపై చ‌ర్చ‌ను నిలిపివేసి.. నీట్ ప‌రీక్ష‌పై ఇచ్చిన వాయిదా తీర్మానంపై చ‌ర్చించాల‌ని విప‌క్షాలు డిమాండ్ చేశాయి. దీనిపై లోక్ స‌భ‌లో చ‌ర్చించాల‌ని ప్ర‌తిప‌క్ష నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఇరు వైపుల నుంచి విద్యార్థుల‌కు సందేశం ఇవ్వాల‌ని ఆశిస్తున్నాన‌ని తెలిపారు. ప్ర‌భుత్వం, విప‌క్షాల వైపు నుంచి నీట్ ప‌రీక్షపై విద్యార్థుల‌కు స్పష్టత ఇద్దామన్నారు. నీట్‌పై ప్ర‌త్యేక చ‌ర్చ చేప‌ట్టాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.

స్పీక‌ర్ ఓం బిర్లా మాట్లాడుతూ.. రాష్ట్ర‌ప‌తి ప్ర‌సంగానికి ధ‌న్య‌వాద తీర్మానం చేప‌ట్ట‌డానికి ముందు ఎటువంటి వాయిదా తీర్మానాల‌ను స్వీక‌రించ‌రు అని తెలిపారు. విప‌క్ష ఎంపీలు మాత్రం ప‌ట్టువీడ‌లేదు. నీట్‌పై చ‌ర్చ చేప‌ట్టాలంటూ నినాదాలు చేశారు. దీంతో స‌భ‌ను 12 గంట‌ల వ‌ర‌కు స్పీక‌ర్ వాయిదా వేశారు. రాజ్య‌స‌భ‌లో కూడా నీట్ అంశంపై ర‌చ్చ జ‌రుగుతోంది. పేప‌ర్ లీకేజీపై ఖ‌ర్గే ఆరోప‌ణ‌లు చేశారు. దీంతో స‌భ‌లో గంద‌ర‌గోళం ఏర్ప‌డింది. ఈ నేప‌థ్యంలో చైర్మెన్ జ‌గ‌దీప్ ధ‌న్‌క‌ర్ స‌భ‌ను 12 గంట‌ల వ‌ర‌కు వాయిదా వేశారు.

లోక్ సభ 12 గంటలకు తిరిగి ప్రారంభం అయ్యాక నీట్ పై చర్చకు విపక్షాలు డిమాండ్ చేయటంతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో స్పీకర్ ఓం బిర్లా సభను రేపటికి వాయిదా వేశారు.

తిరిగి ప్రారంభమైన రాజ్యసభలో విపక్ష సభ్యుల నిరసనల మధ్యే రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యావాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో నీట్ పై చర్చకు అనుమతించాలని డిమాండ్ చేస్తూ విపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే వెల్ లోకి వచ్చారు. దీంతో అధికార, విపక్షాల నినాదాలతో గందరగోళం నెలకొంది.

విపక్ష సభ్యులను సముదాయించేందుకు చైర్మన్ జగదీప్ ధన్ ఖడ్ యత్నించినా వినకపోవటంతో సభను రెండు గంటలవరకు వాయిదావేశారు.

 

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్