నాగాలాండ్ ముఖ్యమంత్రిగా నిఫియు రియో ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ పగు చౌహాన్ రియో తో ప్రమాణ స్వీకారం చేయించారు. రాజధాని కొహిమలోని రాజ్ భవన్ లో ఈ రోజు జరిగిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరయ్యారు. ముఖ్యమంత్రిగా ఐదోసారి ప్రమాణం చేసిన అనంతరం నైఫియుకు ప్రధాని వేదికపైనే అభినందనలు తెలిపారు. అలాగే డిప్యూటీ సీఎంతో పాటు మరో తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ప్రమాణం చేశారు.
వీరిలో జి కైటో అయే, జాకబ్ జిమోమి, కేజీ కెనీ, టెమ్‌జెన్ ఇమ్నా అలోంగ్, సాల్హటునో క్రూజ్ మంత్రులుగా ప్రమాణం చేశారు. సాల్హటునో క్రూజ్ నాగాలాండ్ తొలి మంత్రిగా రికార్డు సృష్టించారు. ఇటీవల ముగిసిన నాగాలాండ్ ఎన్నికల్లో 60 మంది సభ్యుల అసెంబ్లీలో ఎన్‌డీపీపీ-బీజేపీ కూటమి 37స్థానాలను కైవసం చేసుకున్నది. ఎన్‌డీపీపీ, బీజేపీ రెండు రియోను ముఖ్యమంత్రిగా ప్రకటించాయి.

‘ఐ’ధాత్రి న్యూస్ డెస్క్ లో అనుభవజ్ఞులయిన జర్నలిస్టులు, కాపీ ఎడిటర్లు, అనువాదకులు, డిజైనర్లు, డిజిటల్ మీడియా సాంకేతిక నిపుణులు పనిచేస్తుంటారు.