Saturday, November 23, 2024
HomeTrending Newsనియోకోవ్ కొత్త వైరస్ కాదు

నియోకోవ్ కొత్త వైరస్ కాదు

Neocov Is Not A New Virus :

నియోకోవ్ అనేది కొత్త వైరస్ కాదని, ఇది ఇప్పటికే గబ్బిలాల్లో వుందని ఇప్పటివరకు మనుషులకు సోకలేదని శాస్త్రవేత్తలు అంటున్నారు. నియోకోవ్ వైరస్ సోకవచ్చు అనేది చైనా లోని వుహాన్ శాస్త్రవేత్తల ఊహ మాత్రమేనని, ఈ అధ్యయనం పీర్ రివ్యూ కాలేదని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కేవలం మైక్రోస్కోప్ కింద చూసి వైరస్ ఎలా ప్రవర్తిస్తుంది అని చెప్పలేము. ఓమిక్రాన్ ను చూసి వామ్మో ఇన్ని మ్యుటేషన్ లా ? ఇది సోకితే అంతే సంగతులు అన్నారు. చివరకు ఏమి జరిగింది?

ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు క్లిక్ జర్నలిజం నడుస్తోంది. కొలంబియా విశ్వవిద్యాలయం నిర్వహించిన ఒక అధ్యయనం లో తేలింది ఏమిటంటే హెడ్డింగ్ ఎంత నెగటివ్ గా ఉంటే ప్రజలు అంతగా వాటి వైపు ఆకర్షితులు అవుతారు. కేవలం హెడ్డింగ్ మాత్రం చదివి దాన్ని షేర్ చేసేస్తారు. వెబ్ సైట్ కు వ్యూస్ వస్తాయి.

Neo-కోవ్ పై నిన్నటి ది ఒక శాస్త్రవేత్త ప్రతిపాదన మాత్రమే. గతంలో ఎన్నో వందల సార్లు ఎన్నో వందల వైరస్ ల గురించి ఇలాంటి అద్యయనాలు జరిగాయి. “గబ్బిలాల్లోని వైరస్ పై అధ్యయనం “అని హెడ్డింగ్ ఉంటే నిన్నటి వార్తను ఎవరు  పట్టించుకొనే వారు కాదు. “ముగ్గురిలో ఒకడు చస్తాడు “ అనేటప్పటికీ అది వైరల్ అయ్యింది. దేశ వ్యాప్తంగా కొన్ని వేల వెబ్ సైట్స్ కొన్ని కోట్ల షేర్ లు .. నెట్ బిజినెస్ కు ఇదే మూలం. ఏదో ఒక సంచలనం కావాలి. దాన్ని అందరూ తెగ షేర్ చేసుకోవాలి. వ్యూస్ పెరగాలి. ఒక ఊహాజనిత వార్త కు ఇంత ప్రచారం , ఇన్ని కోట్ల వ్యూస్ వచ్చాయి అంటే ఇది , సమాజపు కొత్త పోకడను తెలియచేస్తుంది. జర్నలిజం కు పట్టిన చీడను ఇది ఎత్తిచూపుతుంది

ప్రజలు తాము ఏమి కోరితే అదే దొరుకుతుంది. అదే బిజినెస్ కు … కొత్త రకం బిజినెస్ కు మూల సూత్రం. నియో కోవ్ అనేది కొత్త వైరస్ కాదు. నేటి సమాజపు కొత్త పోకడ. ప్రజల విపరీత మనస్తత్వానికి సూచిక అని వైద్య రంగ నిపుణులు కొట్టిపారేశారు. నెగటివ్ ఆలోచనలతో నెగటివ్ న్యూస్ తో నెగటివ్ దృశ్యాలతో బ్రెయిన్ ను బాంబర్డ్ చేస్తే రోగాలు వస్తాయి. ఇమ్మ్యూనిటి దెబ్బతిని ఒత్తిడి పెరుగుతుంది. బ్లడ్ లో క్లోట్స్ వస్తాయి. అందుకే ఇటీవలి కాలంలో గుండెపోటు , మెదడు పోటుతో ఎక్కువ మంది చనిపోతున్నారు.

మేలుకోండి
సంచలనాల దశ దాటి అందరి చావు వైపుగా మ్యుటేట్ అయిన జర్నలిజం. ముందు మనం మారాలని, నెగటివ్ మాటలు, దృశ్యాల సినిమాలను, భయపెట్టే వార్తలను బహిష్కరించాలి. వాటిని చూడొద్దు. వాటి గురించి మాట్లాడొద్దు. వినొద్దు. ఇదే నేటి సమాజానికి కావలసిన మూల సిద్ధాంతమని జన్యు విశ్లేషకులు, వైద్య రంగ నిపుణులు చెపుతున్నారు.

Also Read : కొత్తగా 2,86,384 కేసులు నమోదు

RELATED ARTICLES

Most Popular

న్యూస్