Sunday, January 19, 2025
HomeTrending Newsఆర్థిక సంక్షోభం దిశగా నేపాల్

ఆర్థిక సంక్షోభం దిశగా నేపాల్

Nepal Financial Crisis : దక్షిణఆసియా దేశాల్లో వివిధ రూపాల్లో కల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్థిక క్రమశిక్షణ లేక శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో కురుకుపోగా , మిలిటరీ పెత్తనం అధికంగా ఉండే పాకిస్తాన్ లో ఎప్పటిలాగే ప్రజాప్రభుత్వాన్ని పడగొట్టారు. దీంతో దేశంలో రాజాకీయ కల్లోలం చెలరేగింది. బంగ్లాదేశ్ లో మతచాందసవాదుల దాడులతో మైనారిటీలు.. ముఖ్యంగా హిందువులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని కాలం గడుపుతున్నారు. అటు ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ ల ప్రభుత్వం ఇంకా కుదురుకోలేదు. అంతర్జాతీయంగా ఒత్తిడి వస్తున్నా పట్టించుకోని జుంటా పాలకులు మయన్మార్ లో ప్రజానాయకులను నిర్భందంలో ఉంచారు. ఇప్పుడు నేపాల్ లో కూడా ఆర్థిక సంక్షోభం తలెత్తే సూచనలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. అన్ని దేశాల్లో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా చైనా స్వార్థ పురిత విధానాల వల్లే అస్థిర పరిస్థితులు నెలకొన్నాయని చెప్పటంలో అతిశయోక్తి లేదు.

నేపాల్‌లో విదేశీ మారక ద్రవ్య నిల్వలు తగ్గిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇందుకు బాధ్యుడిని చేస్తూ దేశ సెంట్రల్‌ బ్యాంకు అయిన ‘నేపాల్‌ రాష్ట్ర బ్యాంకు’(ఎన్‌ఆర్‌బీ) గవర్నర్‌ మహా ప్రసాద్‌ అధికారిని ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని బయటపడేయానికి తగిన కృషి చేయకపోవడాన్ని కారణంగా చూపింది. కొన్ని అంశాల్లో ఆర్థిక మంత్రి జనార్దన్‌ శర్మతో విభేదించడం కూడా మరో కారణం. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి పురుషోత్తం భండారీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ చర్య తీసుకొంది. 2020లో ఆయన నియమితులయ్యారు. పదవీ కాలం అయిదేళ్లు కాగా, ముందుగానే వైదొలగాల్సి వచ్చింది. రాష్ట్ర బ్యాంకు గవర్నర్‌ను సస్పెండ్‌ చేయడం చరిత్రలో ఇది రెండోసారి. విదేశీ ద్రవ్య నిల్వలు తరిగిపోతుండడంతో ఇతర దేశాల నుంచి విలాస వస్తువులు, వాహనాల దిగుమతులపై ప్రభుత్వం నిషేధం విధించింది. గత ఏడాది జులై నాటికి 11.75 బిలియన్‌ డాలర్ల మేర నిల్వలు ఉండగా, ప్రస్తుత ఏడాది ఫిబ్రవరి నాటికి 9.75 బిలియన్‌ డాలర్లకు పడిపోయాయి. ఇవి మరో 6 నెలల 3 వారాల అవసరాలకు సరిపోతాయి. అందువల్ల చమురు, ఇతర అత్యవసరాలు మినహా ఇతర వస్తువుల దిగుమతిపై నిషేధం విధించింది. కాగా, నేపాల్‌లో శ్రీలంక పరిస్థితులు తలెత్తవని ఆర్థిక మంత్రి జనార్దన్‌ శర్మ చెప్పారు. విదేశీ రుణ భారం తక్కువగా ఉందని, రెవెన్యూ వసూళ్లు సంతృప్తికరంగా ఉన్నందున ఇబ్బందులు ఎదురవవని తెలిపారు.

Also Read : శ్రీలంకలో దుర్భర పరిస్థితులు 

RELATED ARTICLES

Most Popular

న్యూస్