Sunday, April 14, 2024
Homeఅంతర్జాతీయంనేపాల్ పార్లమెంట్ రద్దు

నేపాల్ పార్లమెంట్ రద్దు

నేపాల్ పార్లమెంట్ ను రద్దు చేస్తూ ఈ దేశ అధ్యక్షురాలు విద్యా దేవి భండారి నిర్ణయం తీసుకున్నారు. మధ్యంతర ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. నవంబర్ 12, 19 తేదిల్లో ఎన్నికలు జరుగుతాయి.

గత అర్ధరాత్రి ప్రధాని కేపి ఓలి శర్మ నేతృత్వంలో కేబినేట్ అత్యవసరంగా సమావేశమై పార్లమెంట్ ను రద్దు చేయాలని తీర్మానం చేసి విద్యాదేవికి పంపగా ఆమె వెంటనే దాన్ని ఆమోదించారు.

275 సభ్యులున్న నేపాల్ పార్లమెంట్ లో నలుగురు తమ సభ్యత్వం కోల్పోయారు. సాధారణ మెజార్టీ నిరూపించు కోవాలంటే 136 మంది సభ్యుల బలం అవసరం.  కాగా ప్రధాని ఓలి కానీ, నేపాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు షేర్ బహదూర్ దేవ్ బా కాని ఈ మేజిక్ నంబర్ సాధించలేకపోయారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సంఖ్యాబలం తమకుందని  పార్లమెంట్ సభ్యుల పేర్లతో కూడిన లేఖలు అధ్యక్షురాలికి అందజేశారు.  కొందరు సభ్యుల పేర్లు రెండు జాబితాల్లోనూ ఉన్నాయి.  ఈ పరిణామాలను పరిశీలించిన అనతరం పార్లమెంట్ రద్దు చేసి మధ్యంతర ఎన్నికలు జరపాలని విద్యాదేవి నిర్ణయం తీసుకున్నారు.

మే10న పార్లమెంట్ లో జరిగిన విశ్వాస పరీక్షలో ఓడిపోయిన ఓలి తన పదవికి రాజీనామా చేశారు.  తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో నేపాలి కాంగ్రెస్, ప్రచండ నేతృత్వంలోని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ (మావోయిస్ట్ సెంటర్) పార్టీలు విఫలం కావడంతో అతి పెద్ద పార్టీ అయిన ఓలి నే మే 14న మరోసారి నేపాల్ పీఠంపై కూర్చోబెట్టారు అధ్యక్షురాలు భండారి. అయితే వరుసగా రెండోసారి కూడా మెజార్టీ సాధించడంలో విఫలమై రద్దుకు తీర్మానం చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్