Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్హాకీ: ఇండియా పై నెదర్లాండ్స్ షూటౌట్ విజయం

హాకీ: ఇండియా పై నెదర్లాండ్స్ షూటౌట్ విజయం

2021-22 FIH Pro League (W): మహిళల ఎఫ్.ఐ.హెచ్. ప్రో లీగ్-2021-22 లో భాగంగా ఇండియా-నెదర్లండ్స్ మధ్య నేడు జరిగిన రెండో మ్యాచ్ లో నెదర్లాండ్స్ 3-1 (షూటౌట్) తేడాతో విజయం సాధించింది. ఈ రెండు జట్ల మధ్య నిన్న జరిగిన మ్యాచ్ లో 2-1తో ఇండియా విజయం సాధించిన సంగతి గెలిసిందే.

ఓడిశా రాజధాని భువనేశ్వర్ లోని కళింగ స్టేడియంలో జరిగిన ఈరోజు మ్యాచ్ లో  ఆట మొదటి నిమిషంలోపే పెనాల్టీ కార్నర్ ను గోల్ గా మలిచిన రిజ్విందర్ కౌర్  ఇండియాకు బోణీ చేసింది. తొలి అర్ధభాగం నాటికి ఇండియా  ఇదే ఆధిక్యంతో ఉంది. అయితే 54వ నిమిషంలో నెదర్లాండ్స్ కెప్టెన్ జాన్సేన్ యిబ్బీ పెనాల్టీ కార్నర్ ను గోల్ చేసి స్కోరు సమం చేసింది. పూర్తి సమయం అయిపోయే వరకూ మరెవరూ రెండో గోల్ చేయలేకపోవడంతో షూటౌట్ కు వెళ్ళాల్సి వచ్చింది.

షూటౌట్ లో నెదర్లండ్స్ వరుసగా రెండు పాయింట్లు సంపాదించింది. మూడో ప్రయత్నం విఫలం కాగా నాలుగో ప్రయత్నంలో మరో గోల్ సాధించి ఆధిక్యం సంపాదించింది. ఇండియా వరుసగా రెండు ప్రయత్నాల్లో విఫలమై మూడో ప్రయత్నంలో పాయింట్ సంపాదించింది. మళ్ళీ నాలుగో ప్రయత్నంలో విఫలం కావడంతో మ్యాచ్ జేజారిపోయింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్