Thursday, March 19, 2026
Homeస్పోర్ట్స్Pak Vs. NZ: న్యూజిలాండ్ 449 ఆలౌట్

Pak Vs. NZ: న్యూజిలాండ్ 449 ఆలౌట్

పాకిస్తాన్ తో జరుగుతోన్న రెండో టెస్టులో న్యూ జిలాండ్ తొలి ఇన్నింగ్స్ లో 449 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఆరు వికెట్లకు 309 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో రెండోరోజు ఆట మొదలు పెట్టిన కివీస్ జట్టులో మాట్ హెన్రీ-68; టామ్ బ్లండేల్-51; అజాజ్ పటేల్ -35 పరుగులతో రాణించడంతో 449 పరుగులు సాధించింది.

పాకిస్తాన్ బౌలర్లలో అబ్రార్ అహ్మద్ 4;  నషీమ్ షా, ఆఘా సల్మాన్ చెరో 3 వికెట్లు పడగొట్టారు.

పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్ లో రెండో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లకు 154 పరుగులు చేసింది. అబ్ధుల్లా షఫీక్-19; షాన్ మసూద్-20; కెప్టెన్ బాబర్ అజామ్-24 పరుగులు చేసి ఔటయ్యారు. ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్-71;  షాద్ షకీల్-13 పరుగులతో క్రీజులో ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular