7.8 C
New York
Saturday, December 2, 2023

Buy now

Homeస్పోర్ట్స్NZ-SL: శ్రీలంక ఘోర పరాయజం

NZ-SL: శ్రీలంక ఘోర పరాయజం

న్యూజిలాండ్ తో జరిగిన టెస్టు సిరీస్ ను కోల్పోయిన శ్రీలంక  నేడు జరిగిన తొలి వన్డేలో కూడా దారుణ ఓటమి చవిచూసింది. 275 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లంక జట్టు కివీస్ బౌలర్ల ధాటికి 76 పరుగులకే చాప చుట్టేసింది.

రెండు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టి 20 మ్యాచ్ ల సిరీస్  కోసం లంక జట్టు న్యూజిలాండ్ లో పర్యటిస్తోంది. ఆక్లాండ్ లోని ఈడెన్ పార్క్ లో జరిగిన నేటి మ్యాచ్ లో లంక టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఫిన్ అల్లెన్-51; డెరిల్ మిచెల్-47; రచిన్ రవీంద్ర-49; గ్లెన్ ఫిలిప్స్-39 పరుగులు చేయడంతో 49.3 ఓవర్లలో 274  పరుగులకు ఆలౌట్ అయ్యింది.

లంక బౌలర్లలో చమీర కరుణరత్నే 4; కసున్ రజిత, లాహిరు కుమార చెరో 2; మధుశంక, శనక చెరో వికెట్ పడగొట్టారు.

13 పరుగులకు లంక తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత ఇక కోలుకోలేదు.. వరుస వికెట్లు సమర్పించుకుంది. జట్టులో ముగ్గురే… ఆంగ్లో మాథ్యూస్-18; చామిక కరుణరత్నే-11; లాహిరు కుమారా-10 డబుల్ డిజిట్ స్కోరు చేశారు.

కివీస్ బౌలర్ హెన్రీ షిప్లే ఐదు వికెట్లతో రాణించగా, డెరిల్ మిచెల్, బ్లెయిర్ తిక్నర్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

షిప్లే కు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్