Tuesday, March 17, 2026
Homeస్పోర్ట్స్NZ-SL: కివీస్ క్లీన్ స్వీప్

NZ-SL: కివీస్ క్లీన్ స్వీప్

స్వదేశంలో శ్రీలంకతో జరిగిన రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ను న్యూజిలాండ్ క్లీన్ స్వీప్ చేసింది. నేడు ముగిసిన రెండో టెస్టులో ఇన్నింగ్స్, 58 పరుగుల తేడాతో విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్ లో ఫాలో ఆన్ ఆడుతూ 113 పరుగులకు రెండు వికెట్ల వద్ద నేడు చివరిరోజు ఆట మొదలు పెట్టిన లంక జట్టులో ధనుంజయ డిసిల్వా-98; దినేష్ చండీమల్-62 లు రాణించగా.. నిషాన్ మధుశ్క-39; కసున్ రాజిత­-20 పరుగులు చేశారు. 358 పరుగులకు లంక ఆలౌట్ అయ్యింది.

కివీస్ బౌలర్లలో కెప్టెన్ టిమ్ సౌతీ, బ్లెర్ తిక్నర్ చెరో మూడు; మైఖేల్ బ్రేస్ వెల్ రెండు; మాట్ హెన్రీ, డాగ్ బ్రేస్ వెల్ చెరో వికెట్ పడగొట్టారు.

హెన్రీ నికోలస్ కు ప్లేయర్ అఫ్ ద మ్యాచ్ లభించగా, కేన్ విలియమ్సన్ కు ప్లేయర్ అఫ్ ద సిరీస్ దక్కింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular