Sunday, January 19, 2025
HomeTrending NewsEarthquake : న్యూజిలాండ్‌ లో భారీ భూకంపం

Earthquake : న్యూజిలాండ్‌ లో భారీ భూకంపం

న్యూజిలాండ్‌లో భారీ భూకంపం వచ్చింది. గురువారం ఉదయం న్యూజిలాండ్‌కు ఉత్తరాన ఉన్న కెర్మాడెక్ దీవుల్లో భూమి కంపించింది. రిక్టర్‌స్కేలుపై దీని తీవ్రత 7.1 గా నమోదయింది. భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంపం వచ్చిందని యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే (USGS) వెల్లడించింది. సముద్రంలో భూకంపం సంభవించినందున, భూకంప కేంద్రం నుంచి 300 కిలోమీటర్ల వ్యాసార్థంలో సునామీ సంభవించవచ్చని తెలిపింది. ఈ నేపథ్యంలో సునామీ హెచ్చరికలు  జారీచేసింది. కాగా, ఈ భూకంపం వల్ల న్యూజిలాండ్‌కు ఎలాంటి సునామీ హెచ్చరికలు లేవని నేషనల్‌ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్‌ ఏజెన్సీ పేర్కొన్నది.

న్యూజిలాండ్‍లో గత నెల 15న భారీ భూకంపం వచ్చిన విషయం తెలిసిందే. రాజధాని వెల్లింగ్టన్‍‍ సమీపంలో 6.1 తీవ్రతతో భూమి కంపించింది. పరంపరౌము నగరానికి 50 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని అధికారులు గుర్తించారు. ఇక ఫిబ్రవరి 6న తుర్కియే, సిరియాలో వచ్చిన భారీ భూకంపం ధాటికి 50 వేల మందికిపైగా మరణించారు. వేల సంఖ్యలో భవనాలు నేలమట్టమయ్యాయి. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు

RELATED ARTICLES

Most Popular

న్యూస్