స్వదేశంలో ఇంగ్లాండ్ తో జరిగిన రెండో టెస్టులో న్యూజిలాండ్ 1పరుగుతో సంచలన విజయం సాధించింది. విజయానికి 258 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ లో 256 పరుగులకు ఆలౌట్ అయ్యింది. కివీస్ బౌలర్లు నీల్ వాగ్నర్(4), కెప్టెన్ సౌతీ (3), మాట్ హేన్రీ(2)లు అద్భుతంగా రాణించి చిరస్మరణీయమైన గెలుపు అందించారు.
రెండో ఇన్నింగ్స్ లో ఒక వికెట్ నష్టానికి 48 పరుగుల వద్ద నేడు ఐదోరోజు ఆట మొదలు పెట్టిన ఇంగ్లాండ్ 80 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయింది. ఓలీ రాబిన్సన్-2; బెన్ డకేట్-33; ఓలీ పోప్-14; హ్యారీ బ్రూక్ (0) ఔటయ్యారు. ఈ దశలో జో రూట్-బెన్ స్టోక్స్ లు 121 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసి ఇన్నింగ్స్ గాడిలో పెట్టారు. అయితే 14 పరుగుల వ్యవధిలో స్టోక్స్-33; రూట్-95; స్టువార్ట్ బ్రాడ్ -11 లు వెనుదిరిగారు. వికెట్ కీపర్ బెన్ ఫోక్స్ 35 పరుగులతో రాణించినా… మరో ఆరు పరుగులు అవసరమైన సమయంలో సౌతీ బౌలింగ్ లో వెనుదిరిగాడు. 256 వద్ద జేమ్స్ అండర్సన్ వాగ్నర్ బౌలింగ్ లో బ్లండెల్ పట్టిన క్యాచ్ కు అవుట్ కావడంతో సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయాలన్న ఇంగ్లాండ్ ఆశలు నెరవేరలేదు.
రెండు టెస్టుల సిరీస్ 1-1తో సమం అయ్యింది.
కేన్ విలియమ్సన్ ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’…. హ్యారీ బ్రూక్స్ ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కించుకున్నారు.