Tuesday, April 16, 2024
Homeస్పోర్ట్స్Hockey World Cup: న్యూజిలాండ్, నెదర్లాండ్స్ గెలుపు

Hockey World Cup: న్యూజిలాండ్, నెదర్లాండ్స్ గెలుపు

ఎఫ్ఐ హెచ్ పురుషుల వరల్డ్ కప్-2023 టోర్నమెంట్ లో నేడు పూల్-సి జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ల్లో న్యూజిలాండ్, నెదర్లాండ్స్ జట్లు ప్రత్యర్థులపై విజయం సాధించాయి.

న్యూజిలాండ్- చిలీ జట్ల మధ్య జరిగిన రూర్కెలా బిర్సాముండా ఇంటర్నేషనల్ హాకీ స్టేడియంలో జరిగిన మొదటి మ్యాచ్ లో 3-1తేడాతో కివీస్ గెలుపొందింది. 10,12,19 నిమిషాల్లో మూడు ఫీల్డ్ గోల్స్ చేసి పూర్తి ఆధిక్యం సంపాదించింది కివీస్. చిలీ జట్టు 50వ నిమిషంలో ఓ గోల్ చేసింది.  కివీస్ ఆటగాడు హిహా శామ్ రెండు గోల్స్ చేసి ‘మ్యాన్ అఫ్ ద మ్యాచ్’ దక్కించుకున్నాడు.

ఇదే స్టేడియంలో జరిగిన రెండో మ్యాచ్ లో నెదర్లాండ్స్-మలేషియా తలపడగా 4-0తో నెదర్లాండ్స్ ఏకపక్ష విజయం సొంతం చేసుకుంది. 20,24,47 నిమిషాల్లో మూడు గోల్స్ చేసి ఆధిక్యంలో ఉన్న నెదర్లాండ్స్ కు చివరి క్షణాల్లో క్రూన్ జోరిట్ మరో గోల్ అందించి ఆధిక్యాన్ని 4-0కు తీసుకెళ్ళాడు. వీటిలో రెండు ఫీల్డ్ గోల్స్, ఒక పెనాల్టీ కార్నర్, ఒక పెనాల్టీ స్ట్రోక్ ఉన్నాయి.

చివరి క్షణంలో అనూహ్యంగా గోల్ అందించిన క్రూన్ కు ‘మ్యాన్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్