వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూ.టి.సి.) ఫైనల్ మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. రెండో ఇన్నింగ్స్ లో ఇండియా 170 పరుగులకు ఆలౌట్ అయ్యింది. రిషభ్ పంత్ ఒక్కడే 41 పరుగులతో రాణించాడు. రోహిత్ శర్మ ౩౦, పరుగులు రెండో అత్యధిక స్కోరు. 53 ఓవర్లలో 139 పరుగుల విజయ లక్ష్యంతో న్యూజిలాండ్ బరిలోకి దిగింది,.
మూడో రోజు తోలి ఇన్నింగ్స్ లో 2 వికెట్లు కోల్పోయి 101 పరుగులు చేసిన న్యూ జిలాండ్ నాలుగో రోజు ఆట రద్దు కావడంతో ఐదో రోజు ఇన్నింగ్స్ ప్రారంభించి 249 పరుగులకు ఆలౌట్ అయ్యింది. తొలి ఇన్నింగ్స్ లో ఇండియాపై 32 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. ఇండియా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించి ఆట ముగిసే సమయానికి 2 వికెట్లు కోల్పోయి 64 పరుగులు చేసింది. నేడు రిజర్వ్ డే ను వినియోగించుకున్నారు. రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఇండియా 170 పరుగులకే ఆలౌట్ అయ్యింది, సౌతీ 4, బౌల్ట్ 3, జేమిసన్ 2 వికెట్లు సాధించారు, మరో వికెట్ వాగ్నర్ కు దక్కింది.