Friday, March 29, 2024
HomeTrending Newsతెలుగు రాష్ట్రాలపై NHRC ఫైర్

తెలుగు రాష్ట్రాలపై NHRC ఫైర్

తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థుల ఆత్మహత్యల కట్టడికి శాస్త్రీయ చర్యలు తీసుకోకపోవడం పై ఆగ్రహం వ్యక్తం చేసిన జాతీయ మానవ హక్కుల కమిషన్. ఏపీ, తెలంగాణలో విద్యార్థుల ఆత్మహత్యలపై నివేదిక ఇవ్వాలని గత ఏడాది డిసెంబర్లో ఇరు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులని ఆదేశించిన NHRC. తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున విద్యార్థుల ఆత్మహత్యలపై ఎన్.హాచ్.ఆర్.సి కి ఫిర్యాదు చేసిన సుప్రీంకోర్టు న్యాయవాది శ్రావణ్ కుమార్

 విద్యార్థుల ఆత్మహత్యల కట్టడికి రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న శాస్త్రీయ చర్యలు తెలపక పోవడం పై NHRC ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్యార్థుల ఆత్మహత్యల కట్టడికి తీసుకున్న చర్యలపై ఆరు వారాల్లోగా సమగ్ర నివేదిక అందించాలని ఇరు రాష్ట్రల అధికారులకు ఆదేశం.

విద్యార్థుల ఆత్మహత్యల కట్టడికి శాస్త్రీయంగా అధ్యయనం చేసి తీసుకున్న చర్యలపై నివేదిక అందించకపోతే తమ ముందు హాజరు కావాల్సి వస్తుందని సీఎస్ లను NHRC హెచ్చరించింది. తెలంగాణలో 2019 జాతీయ క్రైం రికార్డుల ప్రకారం 426 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోగా తెలంగాణలో ఒకే వారంలో 22 మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు తెలుగు రాష్ట్రాల్లో తీసుకుంటున్న చర్యలు సరిపోవని,  ఏపీలో ప్రభుత్వ క్రైం రికార్డుల ఆధారంగా 383 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారన్న NHRC.

RELATED ARTICLES

Most Popular

న్యూస్