Sunday, September 22, 2024
HomeTrending Newsతమిళనాడులో ఉగ్ర జాడలు...ఎన్‌ఐఏ తనిఖీలు

తమిళనాడులో ఉగ్ర జాడలు…ఎన్‌ఐఏ తనిఖీలు

తమిళనాడులోని నేలపట్టయ్‌కి చెందిన ఓ డ్రైవర్‌ ఇంటిపై ఎన్‌ఐఏ దాడులు నిర్వహించించింది. నిషేధిత పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (PFI) తో సంబంధాలున్నాయనే అనుమానంతో జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్న ఉమర్‌ షరీఫ్‌ ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అతని ఇంట్లో ఆయుధాలు లభించాయని అధికారులు వెల్లడించారు. తన ఇంటి సమీపంలో సిలంబమ్‌ కళను నేర్పిస్తున్నాడని తెలిపారు.

ఈ ఏడాది సెప్టెంబర్‌ 28న పీఎఫ్‌ఐ, దాని అనుబంధ సంస్థలపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. పీఎఫ్ఐ‌తో పాటు దాని అనుబంధ సంస్థలైన సీఎఫ్‌ఐ, ఆల్ ఇండియా ఇమామ్ కౌన్సిల్, రిహాబ్ఇండియా ఫౌండేషన్, నేషనల్ ఉమెన్ ఫ్రంట్ సంస్థలను కూడా చట్ట విరుద్ధమైన సంస్థలుగా కేంద్ర హోం శాఖ ప్రకటించింది.

కాగా, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సంస్థ 2006లో ఏర్పాటయింది. మొదట కేరళలో ప్రారంభమైన ఈ సంస్థ క్రమంగా దేశమంతటా విస్తరించింది. ఢిల్లీ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న పీఎఫ్‌ఐ.. మైనారిటీలు, దళితులు, అణగారిన వర్గాల సాధికారతే లక్ష్యంగా పనిచేయనున్నట్లు పేర్కొంది. అందుకోసం సామాజిక ఉద్యమాన్ని నడుపుతున్నట్లు వెల్లడించింది. కానీ ఈ ముసుగులో రాడికల్ ఇస్లాంను ప్రచారం చేస్తోందని భద్రతా సంస్థలు తెలిపాయి. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ఆందోళనలకు పిలుపునివ్వడం, హింసాత్మక ఘటనలకు పాల్పడటం, కరాటే పేరుతో యువతకు ఉగ్రవాద శిక్షణ ఇవ్వడం, అమాయక యువతను రెచ్చగొట్టి ఉగ్రవాదం వైపు ప్రోత్సహించడం.. వంటి కార్యకలాపాలు చేస్తున్నట్లు పీఎఫ్ఐ‌పై ఆరోపణలున్నాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్