వరుసగా రెండో ఏడాది మహిళల బాక్సింగ్ ఛాంపియన్ గా నిలిచేందుకు తెలుగు తేజం నిఖత్ జరీన్ మరో అడుగు దూరంలో మాత్రమే ఉంది. ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ (ఐబిఏ) ఆధ్వర్యంలో ఢిల్లీలో జరుగుతోన్న ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్ షిప్స్ 50 కిలోల విభాగంలో నిఖత్ సెమి ఫైనల్లో విజయం సాధించింది. కొలంబియాకు చెందిన వాలెన్సియాపై 5-0తో గెలుపొంది టైటిల్ రేసులో నిలిచింది.
నిఖత్ తో పాటు 48 కిలోల విభాగంలో నీతూ గంగాస్, 75 కిలోల విభాగంలో లవ్లీనా, 81 కిలోల విభాగంలో స్వీటీ బూర లు కూడా తమ ప్రత్యర్థులను ఓడించి ఫైనల్లో అడుగు పెట్టారు.
రేపు జరిగే మొదటి విడత ఫైనల్ పోరులో నీతూ.. మంగోలియాకు చెందిన లాట్సై ఖాన్ తోను; స్వీటీ బూర… చైనా ప్లేయర్ వాంగ్ లినా తోను తలపడనున్నారు.
ఎల్లుండి జరిగే రెండో విడత ఫైనల్ మ్యాచ్ ల్లో నిఖత్ జరీన్… వియత్నాం ప్లేయర్ గుయెన్ తితమ్ తోను; ఆస్ట్రేలియా ప్లేయర్ పార్కర్ అన్నే తో లవ్లీనా బార్గోహైన్ ఫైనల్ మ్యాచ్ ఆడడున్నారు.