Sunday, January 19, 2025
HomeTrending Newsప్రధానిని కలుసుకున్న నిఖత్

ప్రధానిని కలుసుకున్న నిఖత్

Nikhat with PM: టర్కీలో ఇటీవల జరిగిన మహిళల వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో 52 కిలోల విభాగంలో విజేతగా నిలిచిన నిఖత్ జరీన్ నేడు ఢిల్లీ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలుసుకున్నారు. ఆమెతో పాటు 57 కిలోలు, 63 కిలోల విభాగంలో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాలు సాధించిన మనీషా మౌన్, పర్వీన్ లు కూడా ప్రధానితో భేటీ అయ్యారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలుసుకోవడం ఓ గౌరవంగా భావిస్తున్నానని అంటూ ఆయనకు ధన్యవాదాలు తెలిపింది నిఖత్. మరోవైపు నిఖత్ కు 2కోట్ల రూపాయల బహుమతి తో పాటు ఓ ఇంటి స్టలాన్ని కూడా మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ సాయంత్రమే జీవో జారీ చేసిన  విషయం గమనార్హం.

Also Read : నిఖత్, ఈషాలకు తెలంగాణా ప్రభుత్వ నజరానా

RELATED ARTICLES

Most Popular

న్యూస్