Wednesday, June 17, 2026
Homeసినిమా'స్పై'అనుభవంతో జాగ్రత్తపడిన నిఖిల్..?

‘స్పై’అనుభవంతో జాగ్రత్తపడిన నిఖిల్..?

యంగ్ హీరో నిఖిల్ నటించిన భారీ పాన్ ఇండియా మూవీ ‘స్పై’. ఈ చిత్రానికి ఎడిటర్ గ్యారీ డైరెక్టర్. కార్తికేయ 2 తర్వాత నిఖిల్ నుంచి వస్తున్న మూవీ కావడం.. ఇది సుభాష్ చంద్రబోస్ మిస్సింగ్ మిస్టరీ నేపధ్యంలో తెరకెక్కిన కథ అని తెలియడంతో ఇది బ్లాక్ బస్టర్ అవుతుందనే టాక్ బలంగా ఉంది. ఈ సినిమా ప్రమోషన్స్ చేయడానికి టైమ్ కావాలని, కొన్ని సీన్స్ రీషూట్ చేయాలని నిఖిల్  అడిగితే . ప్రొడ్యూసర్ రాజశేఖర్ రెడ్డి నో అన్నారని, ఈ విషయమై వీరిద్దరి మధ్య గొడవ జరిగిందని వార్తలొచ్చాయి.

ఈ సినిమా ప్రమోషన్స్ లో నిఖిల్ మాట్లాడిన మాటలను బట్టి నిర్మాతలో విభేదించిన మాట వాస్తవమే అని తెలిసింది. అయితే.. స్పై మూవీ అనుభవంతో ఇక నుంచి తన సినిమాల రిలీజ్ విషయంలో ఓ నిర్ణయం తీసుకున్నాడట.  మొత్తం షూటింగ్ పూర్తయ్యేంత వరకు రిలీజ్ డేట్ ప్రకటించకూడదనే కండిషన్ పైనే ఇకనుంచి సినిమాలు చేస్తాడట నిఖిల్. త్వరలోనే రామ్ చరణ్ నిర్మాతగా ది ఇండియా హౌజ్ అనే సినిమా చేయబోతున్నాడు. చరణ్ ను కూడా ఈ విషయమై రిక్వెస్ట్ చేయగా ఓకే అని చెప్పాడట. ఇక స్వయంభూ అనే మరో సినిమా కూడా ప్రకటించాడు.

నిఖిల్ హ్యాపీడేస్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆతర్వాత యువత సినిమాతో సక్సెస్ సాధించి వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఇప్పుడు కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ సాధించి సంచలనం సృష్టించాడు. ప్రాజెక్ట్ సెట్ అయినప్పటి నుంచి ఆ సినిమా రిలీజ్ వరకు కష్టపడి కాకుండా ఇష్టపడి సినిమాలు చేస్తుంటాడు. అందుకే ఇంత సక్సెస్ అయ్యాడు. అయితే.. స్పై మూవీ విషయంలో జరిగిన అనుభవంతో ఇక నుంచి తన సినిమాల పై మరింత కేర్ తీసుకునేలా ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు నిఖిల్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular