Wednesday, June 17, 2026
Homeసినిమావారాహి యాత్రలో పవన్. మరి.. 'బ్రో' టీజర్ ఎప్పుడు..?

వారాహి యాత్రలో పవన్. మరి.. ‘బ్రో’ టీజర్ ఎప్పుడు..?

పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న భారీ, క్రేజీ మూవీ ‘బ్రో’. ఈ చిత్రానికి సముద్రఖని డైరెక్టర్. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్ర్కీన్ ప్లే – సంభాషణలు అందించారు. ఈ మూవీ మోషన్ పోస్టర్ ఆమధ్య రిలీజ్ చేశారు. ఈ మోషన్ పోస్టర్స్ కు అనూహ్య స్పందన వచ్చింది. అయితే.. ఆతర్వాత నుంచి పవన్ పొలిటికల్ గా బిజీ అవ్వడంతో బ్రో ప్రమోషన్స్ కి బ్రేక్ పడింది. ఇప్పుడు త్వరలో టీజర్ రిలీజ్ చేయనున్నామని తెలియచేస్తూ.. స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో పవన్, తేజ్ మాస్ లుక్ లో కనిపించి సినిమా పై మరింత క్రేజ్ పెంచేశారు.

పవన్ ప్రస్తుతం వారాహి యాత్ర చేస్తూ.. పొలిటికల్ గా ఫుల్ బిజీగా ఉన్నారు. ఇలాంటి టైమ్ లో బ్రో టీజర్ రిలీజ్ చేయనున్నట్టుగా మేకర్స్ ప్రకటించారు. అయితే.. ఈ టీజర్ కు పవన్ ఇంకా డబ్బింగ్ చెప్పలేదు. వారాహి యాత్ర నుంచి హైదరాబాద్ వచ్చే పరిస్థితి లేదు. అందుకనే మొబైల్ డబ్బింగ్ యూనిట్ తీసుకుని డైరెక్టర్ సముద్రఖని మంగళగిరి వెళ్లారట. అయితే.. పవన్ పొలిటికల్ మూడ్ నుంచి బయటకు రావాలి. అప్పుడు టీజర్ లో ఉన్న డైలాగులు డబ్బింగ్ చెప్పాలి. పవన్ డబ్బింగ్ చెప్పడం పూర్తైన తర్వాత టీజర్ ఎప్పుడు అనేది ప్రకటిస్తారు.

తమిళంలో విజయం సాధించిన వినోదయ సీతమ్ చిత్రానికి ఇది రీమేక్. త్వరలో టీజర్ రిలీజ్ అంటూ రిలీజ్ చేసిన స్పెషల్ పోస్టర్ మాస్ గా ఉండడం బట్టి తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా భారీగా మార్పులు చేర్పులు చేశారని తెలుస్తోంది. ఇంకా చెప్పాలంటే.. పవన్ ను అభిమానులు ఎలా చూడాలి అనుకుంటారో అలా ఈ మోడ్రన్ దేవుడు పాత్రను డిజైన్ చేశారని అనిపిస్తుంది. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. జులై 28న ఈ భారీ, క్రేజీ మూవీని భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular