Saturday, November 23, 2024
HomeTrending Newsప్రధానమంత్రి రేసులో లేను - నితీష్ కుమార్

ప్రధానమంత్రి రేసులో లేను – నితీష్ కుమార్

రాబోయే ఎన్నికల్లో ప్రధానమంత్రి అభ్యర్థిగా పోటీలో ఉన్నారంటూ వస్తున్న వార్తల్ని జెడి(యు) అధినేత, బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఖండించారు. తాను ప్రధానమంత్రి రేసులో లేనని ఈ రోజు స్పష్టం చేశారు. ఢిల్లీ లో ఈ రోజు సిపిఎం కార్యదర్శి సీతారాం ఏచూరిని కలిసిన నితీష్ కుమార్ జాతీయ రాజకీయాలు, రాబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యుహాలపై చర్చించారు.

ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో విపక్షాలను ఏకం చేసి ఒక్కతాటి మీదకు తీసుకురావటమే తన లక్ష్యమని నితీష్ కుమార్ స్పష్టం చేశారు. ఇప్పటి వరకు ఏది కోరుకోలేదని , ప్రధానమంత్రి పదవికి కూడా అదే వర్తిస్తుందని పేర్కొన్నారు. 2024 లో విపక్షాల ప్రధానమంత్రి అభ్యర్థి మీరేనా అంటూ మీడియా పదే పదే అడిగిన ప్రశ్నలకు నితీష్ కుమార్ పై విధంగా స్పందించారు.

ఢిల్లీ పర్యటనలో ఉన్న నితీష్ కుమార్ ఇప్పటికే వివిధ పార్టీల నేతలతో సమావేశం అవుతూ రాబోయే ఎన్నికల్లో బిజెపిని డీకొట్టే దిశగా పావులు కదుపుతున్నారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధి, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్, జెడి(ఎస్)అధినేత కుమార స్వామిలతో నితీష్ కుమార్ రాజకీయ సమాలోచనలు జరిపారు. ఇటీవలే తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ తో కూడా చర్చలు జరిపారు. తాజాగా సీతారాం ఏచూరితో సమావేశం కావటం బిజెపి వర్గాల్లో చర్చాప చర్చలకు దారితీస్తోంది.

Also Read :  ఎన్డీయేకు నితీష్ కుమార్ షాక్

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్