Friday, March 29, 2024
Homeస్పోర్ట్స్Badminton: ఆటగాళ్లకు బాయ్ నజరానా

Badminton: ఆటగాళ్లకు బాయ్ నజరానా

కామన్ వెల్త్ గేమ్స్ తో పాటు 2021, 22సంవత్సరాలకుగాను వరల్డ్ ఛాంపియన్ షిప్స్ పోటీల్లో మెడల్స్ సాధించిన ఆటగాళ్లకు బాడ్మింటన్ అసోసియేషన్ అఫ్ ఇండియా (బాయ్) నజరానా ప్రకటించింది.

ఆటగాళ్ళతో పాటు  సిబ్బందికి కూడా ఈ నగదు బహుమతి ప్రకటించింది. మొత్తం ఒక కోటి 42 లక్షల రూపాయలు అందించనుంది. వ్యక్తిగత విభాగంలో లక్ష్య సేన్ కు 25 లక్షలు  ప్రకటించింది. కామన్ వెల్త్ గేమ్స్ లో పురుషుల సింగిల్స్ తో పాటు గత ఏడాది 2021 వరల్డ్ ఛాంపియన్ షిప్స్ లో కాంస్య పతకం సేన్ సాధించాడు.

మన బ్యాడ్మింటన్ ఆటగాళ్ళు అద్భుత ప్రదర్శనతో దేశ ప్రతిష్టను ఇనుమడింప జేస్తున్నారని, వారికి ఇదో చిరు బహుమానంగా ఇస్తున్నామని బాయ్ అధ్యక్షుడు, అస్సాం ముఖ్యమంత్రి డా. హిమాంత బిశ్వా శర్మ వెల్లడించారు.

నగదు బహుమతి వివరాలు ఈ విధంగా ఉన్నాయి (రూపాయల్లో)

లక్ష్య సేన్- 25 లక్షలు (కామన్ వెల్త్ పురుషుల సింగిల్స్ (గోల్డ్) -20 లక్షలు; వరల్డ్ ఛాంపియన్ షిప్స్-2021- కాంస్యం-5లక్షలు)

పివి సింధు  – 20 లక్షలు (కామన్ వెల్త్ గేమ్స్-మహిళల సింగిల్స్ -గోల్డ్)
సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి   – 32.5 లక్షలు (కామన్ వెల్త్ పురుషుల డబుల్స్-25 లక్షలు; వరల్డ్ ఛాంపియన్ షిప్స్-2022- కాంస్యం-7.5 లక్షలు)

కిడాంబి శ్రీకాంత్ – 15 లక్షలు ( కామన్ వెల్త్ గేమ్స్ పురుషుల సింగిల్స్(కాంస్యం)- 5 లక్షలు; వరల్డ్ ఛాంపియన్ షిప్స్-2021(రజతం)-7.5 లక్షలు)

గాయత్రి గోపీచంద్- త్రెసా జాలీ …. 7.5 లక్షలు (కామన్ వెల్త్ గేమ్స్ మహిళల డబుల్స్(కాంస్యం))

కామన్ వెల్త్ గేమ్స్ లో   మిక్స్డ్ టీం విభాగంలో భారత జట్టుకు రజత పతకం లభించింది. ఈ జట్టులో మొత్తం పదిమంది ఆటగాళ్ళు ఉండగా వారికి ఒక్కొక్కరికీ మూడు లక్షల రూపాయలు ప్రకటించింది. దీనితో సేన్, సింధు, సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి, కిడాంబి శ్రీకాంత్, గాయత్రి గోపీ చాంద్, జాలీ లకు పైన తెలిపిన నగదు బహుమతి తో పాటు అదనంగా మరో మూడు లక్షల రూపాయలు లభించనున్నాయి.  వీరితో పాటు ఆకర్షి కాశ్యప్, అశ్విని పొన్నప్ప, బి.సుమీత్ రెడ్డి లకు తలా మూడు లక్షలు బహుమానం అందనుంది.

కామన్ వెల్త్ లో ఆటగాళ్లకు సహకరించిన ఎనిమిది మంది సహాయక ఒక్కొకరికి లక్షన్నర రూపాయల చొప్పున 12 లక్షలు బాయ్ ప్రకటించింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్