Saturday, July 27, 2024
Homeసినిమాబళ్లెంతో గురిపెట్టిన గోండు బెబ్బులి

బళ్లెంతో గురిపెట్టిన గోండు బెబ్బులి

యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ ల క్రేజీ కాంబినేషన్ లో రూపొందుతోన్న భారీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. దర్శకధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న ఆర్ఆర్ఆర్ మూవీలో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్ర పోషిస్తుంటే.. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తున్నారు. ఈ రోజు ఎన్టీఆర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ రోజు (మే 20) 10 గంటలకు కొమరం భీమ్ న్యూలుక్ ను రిలీజ్ చేశారు.

లక్ష్యాన్ని బళ్లెంతో గురిపెట్టిన గోండు బెబ్బులి కొమరం భీమ్ సరికొత్త లుక్ విశేషంగా ఆకట్టుకుంటుంది. నీలి రంగుతో సిద్ధం చేసిన ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్స్ మరియు టీజర్ చూస్తుంటే.. ఈ సినిమాలో ఎన్టీఆర్ నట విశ్వరూపం చూపించడం ఖాయం అనిపిస్తుంది. ఇక ఈ సంచలన చిత్రం విడుదల విషయానికి వస్తే.. దసరా కానుకగా అక్టోబర్ 13న రిలీజ్ చేస్తామని గతంలో ప్రకటించారు కానీ.. కరోనా కారణంగా షూటింగ్ కి బ్రేక్ పడడంతో ఆ తేదీకి విడుదల చేయడం సాధ్యం కాదు. సంక్రాంతికి లేదా సమ్మర్ కి విడుదల చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. క్లారిటీ రావాలంటే.. కొన్ని రోజులు ఆగాల్సిందే.

RELATED ARTICLES

Most Popular

న్యూస్