3.5 C
New York
Monday, December 11, 2023

Buy now

HomeTrending Newsవైద్య రంగంలో స్వీడన్ శాస్త్రవేత్తకు నోబెల్ బహుమతి

వైద్య రంగంలో స్వీడన్ శాస్త్రవేత్తకు నోబెల్ బహుమతి

వైద్యశాస్త్రం (ఫిజియాలజీ)లో చేసిన విశేష కృషికి స్వీడన్‌ శాస్త్రవేత్త స్వాంటే పాబూ నోబెల్‌ బహుమతి-2022కి ఎంపికయ్యారు. ఈ మేరకు స్వీడన్‌లోని కరోలిన్స్కా ఇన్‌స్టిట్యూట్‌లోని నోబెల్‌ సంస్థ సోమవారం ప్రకటించింది. నోబెల్‌ గ్రహీతలకు పది లక్షల స్వీడిష్‌ క్రోనర్స్‌ (సుమారు రూ.9 లక్షలు) నగదు అందుతుంది. మానవుల పరిణామక్రమం, అంతరించిపోయిన హ్యూమనిన్‌ జన్యువులకు సంబంధించి అదనపు జన్యు శ్రేణుల విశ్లేషిస్తూ ఆయన చేసిన పరిశోధనలకు ఈ గుర్తింపు లభించినట్లు ఆ సంస్థ వెల్లడించింది. ఈ ఏడాది అందించే బహుమతుల్లో ఇదే మొదటిది.


గతేడాది ఉష్ణగ్రాహకాలు, మానవుని స్పర్శపై చేసిన పరిశోధనలకు అమెరికన్‌ శాస్త్రవేత్తలు డేవిడ్‌ జూలియస్‌, ఆర్డెమ్‌ పటాపౌటియన్‌లకు ఈ బహుమతి దక్కింది.
1905లో క్షయపై పరిశోధనలు చేసిన రాబర్ట్‌ కోచ్‌, 1945లో పెన్సిలిన్‌ను కనుగొన్న అలెగ్జాండర్‌ ఫ్లెమింగ్‌లు గతంలో ఇదే రంగంలో నోబెల్‌ బహుమతులను గెలుచుకున్నారు. శాస్త్రవిజ్ఞాన, సాహిత్య రంగంతో పాటు ప్రపంచ శాంతికి కృషి చేసిన వారికి అత్యంత ప్రతిష్టాత్మక అవార్డుగా పరిగణించే నోబెల్‌ బహుమతిని 1901 నుండి నోబెల్‌ సంస్థ ప్రదానం చేస్తోంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్