Jagan- Esther Duflo: నోబెల్ బహుమతి గ్రహీత, ఎంఐటీ ప్రొఫెసర్, ప్రపంచ ప్రఖ్యాత ఆర్థిక వేత్త ప్రొఫెసర్ ఎస్తర్ డఫ్లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి పనిచేయనున్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్ రెడ్డితో ఎస్తర్ డఫ్లో బృందం సమావేశమైంది. వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, గృహనిర్మాణం, మహిళా సాధికారిత అంశాల్లో ప్రభుత్వం తీసుకున్న విప్లవాత్మక చర్యలను, అమలు చేస్తున్న కార్యక్రమాలను, పథకాలను ఎస్తర్ డఫ్లో బృందానికి సిఎం జగన్ వివరించారు. ముఖ్యమంత్రి జగన్ దార్శినికుడని, సుస్థిర ఆర్థిక ప్రగతి లక్ష్యాలవైపు ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఎస్తర్ డఫ్లో ప్రశంసించారు.
ఎస్తర్ డఫ్లో మాట్లాడిన ముఖ్యాంశాలు:
- పేదరిక నిర్మూలన పట్ల అంకిత భావంతో ఉన్నారు
- ముఖ్యమంత్రి ఒక గదిలో కూర్చొని పథకాలు తీసుకురాలేదు
- క్షేత్ర స్థాయిలో ప్రజల సమస్యలు తెలుసుకుని పథకాలు తీసుకు వచ్చారు
- దీనివల్ల కొత్తగా చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి మేం చెప్పాల్సింది ఏమీ ఉండదు
- అమలవుతున్న వాటిని మరింత బలోపేతం చేయడానికి మాత్రమే మా తరఫు నుంచి సలహాలు ఇస్తాం
- అర్హులు ఎవ్వరూ మిగిలిపోకూడదంటూ ముఖ్యమంత్రి తీసుకుంటున్న చొరవ.. అనేది, ఆయన గొప్ప ఆలోచనా దృక్పథాన్ని వెల్లడిస్తోంది:ఎస్తర్ డఫ్లో
- పేదరికాన్ని నిర్మూలించాలనే ఆయన అంకితభావాన్ని వెల్లడిస్తోంది
- డీబీటీ స్కీంల్లో అధికభాగం నేరుగా మహిళల ఖాతాల్లోకి వేయడం హర్షణీయం
- గృహనిర్మాణంలో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడం అన్నది.. కేవలం మహిళా సాధికారికతకే కాదు.. దీనివల్ల అన్నిరకాలుగా కుటంబం సుస్థిరమవుతుంది
- సుస్థిర ఆర్థిక ప్రగతి కోసం నిర్దేశించుకున్న లక్ష్యాల సాధనలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల అమలు తీరు, దాని ప్రభావంపై స్టడీ చేసి, సలహాలు కోరడం అనేది కూడా సీఎంగా ఆయనకున్న దార్శినికతకు నిరద్శనం
- వివిధ అంశాలపై ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్‌కున్న పరిజ్ఞానం మమ్మల్ని ఆకట్టుకుంది
- ఆయనకున్న అంకిత భావం కూడా ఆకట్టుకుంది
- గడచిన 15 ఏళ్లుగా వివిధరంగాల్లో జె–పాల్ (జె–పాల్ అంటే ది అబ్దుల్ లతీఫ్ జమీల్ పావర్టీ యాక్షన్ ల్యాబ్) పనిచేస్తోంది, దేశంలోని 20 రాష్ట్రాల్లో పనిచేస్తున్నాం
ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్‌లో పైలట్‌ప్రాజెక్టు కింద కొన్ని అంశాల్లో పనిచేస్తున్నామని డఫ్లో చెప్పారు. సిఎం తో భేటీ తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన సీనియర్ అధికారులతోనూ డఫ్లో బృందం సమావేశమైంది.