Saturday, January 18, 2025
HomeTrending Newsరష్యా టార్గెట్ గా నోబెల్ శాంతి బహుమతి

రష్యా టార్గెట్ గా నోబెల్ శాంతి బహుమతి

నోబెల్‌ శాంతి బహుమతి 2022 ఏడాదికి గాను జ్యూరీ ఈ రోజు (శుక్రవారం) ప్రకటించింది. ఈసారి శాంతి పుర‌స్కారాన్ని ఓ వ్య‌క్తితో పాటు మ‌రో రెండు సంస్థ‌ల‌కు క‌లిపి ప్రకటించారు. నార్వేయ‌న్ నోబెల్ క‌మిటీ ఈ అవార్డును ప్ర‌క‌టించింది. జైలు పాలైన బెలారస్‌ మానవహక్కుల న్యాయవాది అలెస్‌ బైలియాట్స్కితో పాటు రష్యా మావన హక్కుల సంస్థ ‘మెమోరియల్‌’, ఉక్రెయిన్‌ మానవహక్కుల సంస్థ ‘సెంటర్‌ ఫర్‌ సివిల్‌ లిబర్టీస్‌’ లు నోబెల్‌ బహుమతికి ఎంపికయ్యాయి. అలెస్‌తో పాటు ఈ సంస్థలు బెలారస్‌, రష్యా, ఉక్రెయిన్‌లలో మానవహక్కులు, ప్రజాస్వామ్యం, శాంతికి కృషి చేశాయని నోబెల్‌ కమిటీ పేర్కొంది. యుద్ధ నేరాల‌ను డాక్యుమెంట్ చేయ‌డంలో వాళ్లు అసాధార‌ణ సామ‌ర్థ్యాన్ని ప్ర‌ద‌ర్శించిన‌ట్లు వివరించింది. అధికార దుర్వినియోగాన్ని వాళ్లు నిరంత‌రం ప్ర‌శ్నించార‌ని తెలిపింది.

1980వ సంవత్సరం మధ్యలో బెలారస్‌లో ఉద్భవించిన ప్రజాస్వామ్య ఉద్యమాన్ని ప్రారంభించిన వారిలో అలెస్‌ ఒకరు. సంస్థ వ్యవస్థాపకుడు వియాస్నా (స్ప్రింగ్‌) తన స్వదేశంలో ప్రజాస్వామ్యం, శాంతికి కృషి చేశారు. అయితే అలెస్‌ బైలియాట్స్కి గొంతు అణచివేసేందుకు అక్కడి ప్రభుత్వం యత్నిస్తూనే ఉంది. 2020లో విచారణ లేకుండానే ఆయనను అదుపులోకి తీసుకుంది. రష్యా, ఉక్రెయిన్‌, బెలారస్‌లో రాజకీయాలు ప్రపంచవ్యాప్తంగా యుద్ధం దిశగా వెళుతున్న సమయంలో ఈ మూడు సంస్థలు యుద్ధ నేరాలు, మానవ హక్కులు, అధికార దుర్వినియోగం జరగకుండా అడ్డుకున్నాయని, ప్రపంచ శాంతి, ప్రజాస్వామ్యం కోసం కృషి చేశాయని కమిటీ తెలిపింది.

అయితే 2022 నోబెల్ శాంతి బహుమతి ప్రకటనలో పశ్చిమ దేశాల ప్రభావం ఉంది అన్నట్టుగా ఉంది. రష్యా టార్గెట్ గానే ఈ దఫా శాంతి బహుమతి ప్రకటించారు. బెలారస్ ప్రభుత్వం రష్యాకు మద్దతు ఇస్తోంది. బెలారస్‌ మానవహక్కుల న్యాయవాది అలెస్‌ బైలియాట్స్కి ఆ దేశ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. అటు రష్యాలోని మావన హక్కుల సంస్థ ‘మెమోరియల్‌ కూడా పుతిన్ ప్రభుత్వ తప్పులు ఎత్తి చూపటమే పనిగా పెట్టుకుంది. మాస్కో కేంద్రంగా పని చేస్తున్న ఈ సంస్థను రష్యా ప్రభుతం విదేశీ గూడాచారిగా ప్రకటించింది. ఉక్రెయిన్‌ మానవహక్కుల సంస్థ ‘సెంటర్‌ ఫర్‌ సివిల్‌ లిబర్టీస్‌ కూడా ఆ దేశంలో రష్యా పనులను చిత్రీకరించే పనిలో ఉంది. ఉక్రెయిన్ దేశానికి మొదటి సారిగా శాంతి బహుమతి దక్కింది. ఉక్రెయిన్ దేశం నుంచి ఒక పౌరుడు గాని ఒక సంస్థకు నోబెల్ బహుమతి దక్కటం ఇదే ప్రథమం కాగా అమెరికా, నాటో దేశాల ప్రభావం ఉందని విశ్లేషకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Also Read : వైద్య రంగంలో స్వీడన్ శాస్త్రవేత్తకు నోబెల్ బహుమతి

RELATED ARTICLES

Most Popular

న్యూస్