Sunday, September 8, 2024
HomeTrending NewsElection Results 2023 : ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం

Election Results 2023 : ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం

ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, నాగాలాండ్‌, మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌ కొద్ది సేపటి క్రితం ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు పోస్టల్‌ ఓట్ల లెక్కింపుతో అధికారులు కౌంటింగ్‌ ప్రక్రియ ప్రారంభించారు. మధ్యాహ్నానికి ఫలితాలు వెలువడే అవకాశం ఉన్నది. మూడు రాష్ట్రాల్లోనూ 60 చొప్పున అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అయితే త్రిపురలో ఫిబ్రవరి 16న, నాగాలాండ్ , మేఘాలయాలో ఫిబ్రవరి 27న పోలింగ్‌ జరిగిన సంగతి తెలిసిందే. మేఘాలయలో 59 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 78 శాతం, నాగాలాండ్‌లో 59 స్థానాలకు 86 శాతం, త్రిపురలో 60 స్థానాలకు 87 శాతం పోలింగ్‌ నదయింది.

కాగా, ఇప్పటివరకు మూడు రాష్ట్రాల్లోనూ బీజేపీ దాని మిత్రపాక్షాలే ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. త్రిపురలో మొత్తం 60 స్థానాలకుగాను అధికార బీజేపీ 24, ప్రతిపక్ష సీపీఎం 23 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. ఇక టీఎంసీ 12, ఇతరులు 1 చొప్పున లీడ్‌లో ఉన్నారు. మేఘాలయలో ఎన్‌పీపీ 12 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, బీజేపీ 5 చోట్ల, కాంగ్రెస్‌ 7, తృణమూల్‌ కాంగ్రెస్‌ 19, ఇతరులు 16 చోట్ల లీడ్‌లో కొనసాగుతున్నారు. ఇక నాగాలాండ్‌లో బీజేపీ ఇప్పటికే ఓ స్థానాన్ని ఏకగ్రీవం చేసుకోగా, మిత్రపక్షంతో కలిసి మరో 44 సీట్లలో ఆధిక్యంలో ఉంన్నది. ఎన్‌పీఎఫ్‌ 5, కాంగ్రెస్‌ 1, ఎన్‌పీపీ 2 చొట్ల ఆధిక్యంలో కనసాగుతున్నాయి.
RELATED ARTICLES

Most Popular

న్యూస్