9.2 C
New York
Monday, December 4, 2023

Buy now

HomeTrending Newsరాజీవ్‌ స్వగృహ ప్లాట్ల‌ వేలా‌నికి నోటి‌ఫి‌కే‌షన్‌

రాజీవ్‌ స్వగృహ ప్లాట్ల‌ వేలా‌నికి నోటి‌ఫి‌కే‌షన్‌

Rajiv Swagruha Flats : హెచ్‌‌ఎం‌డీఏ పరి‌ధి‌లో ఈ–వేలం.. జిల్లాల్లో బహి‌రంగ వేలం తెలం‌గాణ రాజీవ్‌ స్వగృహ కార్పొ‌రే‌షన్‌ లిమి‌టెడ్‌ ఫ్లాట్ల వేలా‌నికి సర్వం సిద్ధ‌మైంది. బండ్ల‌గూడ, పోచా‌రం‌లోని ఫ్లాట్ల వేలా‌నికి హెచ్‌‌ఎం‌డీఏ మంగ‌ళ‌వారం నోటి‌ఫి‌కే‌షన్‌ విడు‌దల చేయ‌ను‌న్నది. బండ్ల‌గూ‌డలో నిర్మాణం పూర్త‌యిన 419 ఫ్లాట్లను చద‌రపు అడు‌గుకు రూ.3 వేలు, అసం‌పూ‌ర్తిగా ఉన్న 1,082 ఫ్లాట్లను చద‌రపు అడు‌గుకు రూ.2,750, పోచా‌రంలో పూర్త‌యిన 1,328 ఫ్లాట్లను చద‌రపు అడు‌గుకు రూ.2500, కొద్ది అసం‌పూ‌ర్తిగా ఉన్న 142 ఫ్లాట్లను చద‌రపు అడు‌గుకు రూ.2,250 చొప్పున వ్రిక‌యిం‌చ‌ను‌న్నారు. ఈ రెండు ప్రాంతాల్లో లాటరీ పద్ధ‌తిలో లబ్ధి‌దా‌రులను ఎంపిక చేస్తారు.

ఎవ‌రైనా మీ సేవ ద్వారా దరఖాస్తు చేసు‌కోవచ్చు. లక్కీడ్రా ద్వారా ఫ్లాట్లను కేటా‌యి‌స్తారు. బండ్ల‌గూడ, పోచారం కాకుండా హెచ్‌‌ఎం‌డీఏ పరి‌ధి‌లోని చందా‌న‌గర్‌, జవ‌హ‌ర్‌‌న‌గర్‌, గాజు‌ల‌రా‌మారం ప్రాజె‌క్టుల్లో ఈ–ఆ‌క్షన్‌ ద్వారా ఫ్లాట్లను విక్ర‌యి‌స్తారు. ఇతర జిల్లాల పరి‌ధి‌లో బహి‌రంగా వేలం నిర్వహిస్తారు. 2, 3 రోజుల్లో నోటి‌ఫి‌కే‌షన్‌ రానున్నది.

అటు.. రాజీవ్‌ స్వగృహ ఇండ్ల అమ్మ‌కాల ప్రక్రి‌యను వేగంగా పూర్తి చేయా‌లని సీఎస్‌ సోమే‌శ్‌‌కు‌మార్‌ అధి‌కా‌రు‌లను ఆదే‌శిం‌చారు. సోమ‌వారం బీఆ‌ర్కే‌భ‌వ‌న్‌లో హౌసింగ్‌ అధి‌కా‌రు‌లతో ఆయన సమీక్ష నిర్వ‌హిం‌చారు. మధ్య తర‌గతి ప్రజలు ఈ ఇండ్లను కొను‌గోలు చేస్తా‌రని, సులభ దర‌ఖా‌స్తుకు వీలుగా మాడ్యూల్‌ రూపొం‌దిం‌చా‌లని సూచిం‌చారు. అప్లి‌కే‌షన్‌ ప్రక్రియ అసాంతం ఆన్‌‌లై‌న్‌‌లోనే స్వీక‌రిం‌చా‌లని తెలి‌పారు.

Also Read : స్వగృహ ఫ్లాట్లు అమ్మకానికి సిద్ధం

RELATED ARTICLES

Most Popular

న్యూస్