Sunday, January 19, 2025
Homeస్పోర్ట్స్జకోవిచ్ దే ఫ్రెంచ్ ఓపెన్ కిరీటం

జకోవిచ్ దే ఫ్రెంచ్ ఓపెన్ కిరీటం

ఫ్రెంచ్ ఓపెన్ మెన్స్ ఫైనల్ మ్యాచ్ లో జకోవిచ్ విజయం సాధించారు. ఆద్యంతం ఆసక్తిగా సాగిన మ్యాచ్ లో వరల్డ్ నంబర్ వన్, సెర్బియా సూపర్ స్టార్ జకోవిచ్ తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకున్నారు. గ్రీస్ ఆటగాడు స్టెఫనోస్ సిట్సిపాస్ జకోవిచ్ కు తొలుత గట్టి పోటీ ఇచ్చాడు. తొలి రెండు సెట్లు 6-7, 2-6 తేడాతో గెల్చుకున్న సిత్సిపాస్ తరువాతి సెట్లలో 6-3,6-2, 6-4 తేడాతో కోల్పోయి మ్యాచ్ ను చేజార్చుకున్నారు. నాలుగు గ్రాండ్ స్లా మ్ టైటిల్స్ ను కనీసం రెండుసార్లు గెల్చుకున్న ఆటగాడిగా మరో రికార్డును తన పేరిట లిఖించుకున్నారు.

సెమి ఫైనల్ లో మూడో సీడ్‌ నాదల్‌ను 3–6, 6–3, 7–6 (7/4), 6–2తో ఓడించి ఫైనల్ కు చేరాడు జొకోవిచ్‌ (సెర్బియా). గత ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో నాదల్‌ చేతిలో ఓడిపోయిన జకోవిచ్ తన ఓటమికి బదులు చెప్పాడు. ఫ్రెంచ్‌ ఓపెన్‌లో నాదల్‌ను రెండుసార్లు ఓడించిన ఆటగాడిగా జొకోవిచ్‌ నిలిచారు.

గ్రీస్ స్టార్ స్టెఫనోస్‌ సిట్సిపాస్‌ గతంలో సెమీఫైనల్‌ దాటి ముందుకు రాలేకపోయారు. కానీ ఈసారి టైటిల్‌ పోరుకు సిద్ధమయ్యాడు. శుక్రవారం జరిగిన పురుషుల తొలి సెమీఫైనల్లో ఐదో సీడ్‌ సిట్సిపాస్‌  6–3, 6–3, 4–6, 4–6, 6–3తో ఆరో సీడ్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ (జర్మనీ)పై విజయం సాధించాడు. తద్వారా ఓ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో ఫైనల్‌కు చేరిన తొలి గ్రీస్‌ ప్లేయర్‌గా సిట్సిపాస్‌ రికార్డు సాధించాడు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్