Friday, March 13, 2026
Homeజాతీయంత్వరలోనే నోవా వాక్స్ తయారీ : వికె పాల్

త్వరలోనే నోవా వాక్స్ తయారీ : వికె పాల్

భారత్‌లో త్వరలోనే నోవావాక్స్‌ టీకా భారీగా తయారవుతుందని భావిస్తున్నట్టు నీతిఆయోగ్‌ (ఆరోగ్యం) సభ్యుడు వీకే పాల్‌ తెలిపారు. అమెరికాకు చెందిన నోవావాక్స్‌ సంస్థతో సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ కలిసి పనిచేస్తోందని, భారత్‌లో టీకా ఉత్పత్తికి ఏర్పాట్లు చేస్తోందని చెప్పారు. ఈ టీకా క్లినికల్‌ ట్రయల్స్‌ తుది దశకు చేరాయన్నారు. ఇప్పటివరకు వచ్చిన ఫలితాలు ఆశావహంగానే ఉన్నట్టు పాల్‌ వివరించారు. మరోవైపు, మూడో దశలో తమ టీకా సామర్థ్యం 90శాతంగా ఉన్నట్టు నోవావాక్స్‌ నిన్న ప్రకటించిన విషయం తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular