Wednesday, May 8, 2024
HomeTrending Newsనామాకు ఈడి సమన్లు :25 న రావాలని పిలుపు

నామాకు ఈడి సమన్లు :25 న రావాలని పిలుపు

తెలంగాణ రాష్ట్ర సమితి లోక్ సభా పక్ష నేత, ఖమ్మం ఎంపి నామా నాగేశ్వర రావు కు ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడి) సమన్లు జారీ చేసింది. ఈనెల 25 న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. బ్యాంకు రుణాలను మళ్లించిన కేసులో ఈ సమన్లు జారీ చేసింది. నామాతో పాటు మధుకాన్ బోర్డు డైరెక్టర్లను కూడా విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది.

జూన్ 11 నుంచి రెండ్రోజుల పాటు నామా ఇళ్లు, కార్యాలయాలతోపాటు మధుకాన్ కంపెనీ డైరెక్టర్ల నివాసాల్లో ఈడి సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో కీలక పత్రాలతో పాటు భారీగా నగదు పట్టుబడినట్లు వార్తలొచ్చాయి.

2011 లో రాంచి-జంషెడ్ పూర్ హైవే నిర్మాణ కాంట్రాక్టు మధుకాన్ కంపెనీ దక్కించుకుంది. ఈ ప్రాజెక్టు కోసం వివిధ బ్యాంకుల కన్సార్షియం నుంచి 1,064 కోట్ల రూపాయల రుణాన్ని కంపెనీ పొందింది. అయితే వాటిలో కొన్ని నిధులను దారి మళ్లించినట్లు ఆరోపణలు వచ్చాయి. ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయకపోవడంతో రాంచి హైకోర్టులో కేసులు దాఖలయ్యాయి. దీనిపై విచారణ జరిపిన రాంచి హైకోర్టు దీనిపై సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ కింద విచారణ జరపాలని ఆదేశించింది. 2019లో కేసు దాఖలు చేసిన సిబిఐ 2020 లో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. సిబిఐ ఛార్జ్ షీట్ ఆధారంగా ఈడి రంగంలోకి దిగి విచారణ ప్రారంభించింది. మనీ లాండరింగ్ కేసు కూడా నమోదు చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్