Sunday, October 6, 2024
HomeTrending Newsఇకపై రాజకీయ పాలనే ఉంటుంది: ఎంపిలతో బాబు

ఇకపై రాజకీయ పాలనే ఉంటుంది: ఎంపిలతో బాబు

పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపిలు ఎవరి పరిధిలో వారు కలిసి పనిచేయాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. ఇటీవలి ఎన్నికల్లో గెలిచిన లోక్ సభ సభ్యులతో బాబు భేటీ అయ్యారు. అందుబాటులో ఉన్న ఎంపిలు నేరుగా హాజరు కాగా, మిగిలినవారు జూమ్ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ ఇకపై మారిన చంద్రబాబును చూస్తారని, బ్యూరోక్రాట్స్ పాలన ఎంతమాత్రమూ ఉండబోదని స్పష్టం చేశారు.

బాబు మాట్లాడిన ముఖ్యాంశాలు:

  • ఇకపై మీరు మారిన చంద్రబాబును చూస్తారు
  • ఇకపై బ్యూరోక్రాట్స్ పాలన ఎంతమాత్రం ఉండదు
  • చంద్రబాబు మారరు అనే అపవాదు నాపై ఉంది – ఇకపై అలా ఉండదు.. మీరే ప్రత్యక్షంగా చూస్తారు
  • ఎంపీలందరూ తరచూ వచ్చి కలవండి – నేను బిజీగా ఉన్నా కూడా మీతో మాట్లాడతాను
  •  నాకోసం ఈ ఐదేళ్లు నేతలు, కార్యకర్తలు ప్రాణాలిచ్చారు
  • కత్తి మీద పెట్టినా జై టీడీపీ, జై చంద్రబాబు అన్నారు
  • అధికార పార్టీ ఒత్తిడికి ఎవరూ తలొగ్గలేదు
  • ఇకపై ప్రతి అంశాన్ని నేను వింటాను.. నేనే చూస్తాను
  • ఇకపై రాజకీయ పరిపాలన ఉంటుంది
  • ఎంపీలు, ఎమ్మెల్యేలు అంతా కలిసి పనిచేయాలి
  • అందరూ ఎవరి పరిధిలో వారు పనిచేయాలి
  • ఈ ఐదేళ్లు నేతలు, కార్యకర్తలు పడిన ఇబ్బందులు నాకు చాలా మనోవేదన కలిగించాయి
  • నేతలు, కార్యకర్తల కష్టం, త్యాగం, కృషి వల్లే ఇవాళ పార్టీ అధికారంలోకి వచ్చింది
  • ఈనెల 12 ప్రమాణ స్వీకారం చేస్తా
  • ఢిల్లీలో రాష్ట్ర ప్రయోజనాల కోసం పని చేయాలి అంటూ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు.

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్