Thursday, January 23, 2025
HomeTrending News12 వారాల తర్వాతే కోవిషీల్ద్

12 వారాల తర్వాతే కోవిషీల్ద్

కోవిషీల్ద్ టికా రెండు డోసుల మధ్య  సమయాన్ని పెంచుతూ జాతీయ టికా సాంకేతిక సలహా మండలి నిర్ణయం తీసుకుంది. కోవిషీల్ద్ మొదటి డోసు తీసుకున్న తరువాత 6 నుంచి 8 వారాల మధ్యలో రెండో డోసు తీసుకోవాలని గతంలో సలహా మండలి సూచించింది. అయితే మరిన్ని పరిశోధనల తరువాత ఈ సమయాన్ని 12 నుంచి 16 వారాలకు పెంచింది.  దీన్నిబట్టి కోవిషీల్ద్ మొదటి డోసు తీసుకున్న వారు రెండో డోసు తీసుకునేందుకు మూడు నెలల వరకూ సమయం వుంటుంది.

కోవాక్సిన్  డోసుల విషయంలో ఎలాంటిమార్పు లేదు. తోలి డోసు తీసుకున్న 4 నుంచి 6 వారాల మధ్యలో రెండో డోసు కూడా తీసుకోవాలి.  కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయి కోలుకున్న వారు ఆరు నెలల తర్వాతే వాక్సిన్ తీసుకోవాలని సలహా మండలి సూచించింది.

మరోవైపు ­2 నుంచి 18 ఏళ్ళ మధ్య వయసు వున్న వారిపై కోవాక్సిన్ రెండు, మూడో దశ క్లినికల్ ట్రయల్స్ కు భారత ఔషధ నియంత్రణ మండలి భారత్ బయోటెక్ సంస్థకు అనుమతించింది. 525 మందిపై ట్రయల్స్ నిర్వహించనుంది భారత్ బయోటెక్ సంస్థ

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్