Friday, April 19, 2024
Homeసినిమా'అమిగోస్' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఎన్టీఆర్ వస్తున్నాడు: కల్యాణ్ రామ్ 

‘అమిగోస్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఎన్టీఆర్ వస్తున్నాడు: కల్యాణ్ రామ్ 

కల్యాణ్ రామ్ చాలా కాలం తరువాత ‘బింబిసార’ సినిమాతో హిట్ కొట్టాడు. ఆ తరువాత ఆయన నుంచి వస్తున్న సినిమానే ‘అమిగోస్‘. మైత్రీ మూవీస్ వారు ఈ సినిమాను నిర్మించారు. రాజేంద్ర రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ నెల 10వ తేదీన భారీ స్థాయిలో విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. కర్నూల్ లోని శ్రీరామ థియేటర్ వేదికగా ఈ ట్రైలర్ విడుదలైంది.

సినిమాలో ఉన్న కంటెంట్ ను ట్రైలర్ లో చెప్పడంలోనూ .. ఆసక్తిని రేకెత్తించడంలోను సక్సెస్ అయ్యారు. ట్రైలర్ రిలీజ్ ఈవెంటులో కల్యాణ్ రామ్ మాట్లాడుతూ … “తెలుగు ప్రేక్షకులు కొత్తదనం ఉన్న సినిమాలను ఆదరిస్తూనే వస్తున్నారు. అలాంటి కొత్తదనంతోనే ‘అమిగోస్’ రూపొందింది. ఇంతకుముందు తాతగారు .. బాబాయ్ .. తమ్ముడు అందరూ కూడా ద్విపాత్రాభినయం చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ సినిమాలో నేను త్రిపాత్రాభినయం చేశాను.

అయితే ఆ సినిమాల కథలు అన్నదమ్ముల మధ్య జరిగితే, ఈ సినిమా కథ మనుషులను పోలిన మనుషుల మధ్య జరుగుతుంది. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. థియేటర్ కి వచ్చిన ప్రతి ఒక్కరూ చాలా హ్యాపీగా తిరిగి వెళతారని హామీ ఇస్తున్నాను. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎల్లుండి జరుగుతుంది. ఆ ఫంక్షన్ కి తమ్ముడు ఎన్టీఆర్ వస్తున్నాడు. మనందరం కూడా మళ్లీ అక్కడ కలుసుకుందాం” అంటూ చెప్పుకొచ్చాడు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్