Wednesday, June 17, 2026
HomeసినిమాDevara: ఎన్టీఆర్ 'దేవర' ఇంట్రస్టింగ్ న్యూస్

Devara: ఎన్టీఆర్ ‘దేవర’ ఇంట్రస్టింగ్ న్యూస్

‘ఆర్ఆర్ఆర్’తర్వాత ఎన్టీఆర్ తో సినిమా చేయాలని చాలా మంది మేకర్స్ ట్రై చేశారు కానీ.. కొరటాలతో సినిమాకే జూనియర్ ఓకే చెప్పారు. వీరిద్దరూ గతంలో ‘జనతా గ్యారేజ్’ చేశారు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. దీంతో తాజాగా చేస్తున్న ‘దేవర’ పై కూడా భారీ అంచనాలున్నాయి. పవర్ ఫుల్ రోల్ లో ఎన్టీఆర్ ను చూపించిన దేవర ఫస్ట్ లుక్ కు అనూహ్య స్పందన వచ్చింది.

ఈ సినిమా గురించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది.  ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్నారట. ఇంటర్వెల్ లో రివీల్ అయ్యే ఈ రెండో క్యారెక్టర్ కథను మలుపు తిప్పుతుందట. పైగా సెకండ్ హాఫ్ డ్రైవ్ మొత్తం ఎన్టీఆర్ రెండో క్యారెక్టర్ చుట్టే తిరుగుతుందని తెలుస్తోంది. కొరటాల ఈ కథ కోసం చాలా నెలలు కసరత్తులు చేశాడు. ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడనే వార్త బయటకు వచ్చినప్పటి నుంచి కథలో ఎలాంటి ఎలిమెంట్స్ ఉంటాయో అనేది ఆసక్తిగా మారింది.

ఎన్టీఆర్ కు జంటగా శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ నటిస్తుంది. అలాగే విలన్ గా సైఫ్ ఆలీఖాన్ నటిస్తున్నాడు. ఇటీవల ఎన్టీఆర్, సైఫ్ ఆలీఖాన్ మధ్య కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ భారీ పాన్ ఇండియా మూవీకి అనిరుథ్ సంగీతం అందిస్తున్నారు. నందమూరి కళ్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే సంవత్సవరం ఏప్రిల్ 5న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular