పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ  వరుసగా సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం నాలుగు  ప్రాజెక్టులు సెట్స్ పై  ఉన్నాయి. వచ్చే ఎన్నికల సమయానికి ఈ నాలుగూ పూర్తి చేయాలనుకుంటున్నారు.  సముద్రఖని డైరెక్షన్ లో రూపొందుతోన్న ‘బ్రో’ షూటింగ్ చివరి దశలో ఉంది.  పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ కు అనూహ్య స్పందన వచ్చింది. జులై 28న దీన్ని విడుదల చేయనున్నారు. మామ అల్లుళ్ళు పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ కలిసి నటిస్తోన్న సినిమా కావడంతో బ్రో పై భారీ అంచనాలు ఉన్నాయి.

దీనితో పాటు ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్, హరి హర వీరమల్లు చిత్రాల్ని కూడా త్వరగా కంప్లీట్ చేయాలనుకుంటున్నారు. అయితే.. గబ్బర్ సింగ్ కాంబోలో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పై రోజురోజుకు అంచనాలు పెరుగుతున్నాయి. ఇటీవల రిలీజ్ చేసిన గ్లింప్స్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.  పవన్ చేస్తున్న సినిమాల్లో ఈ సినిమాకే ఎక్కువ క్రేజ్ ఉంది. బిజినెస్ వర్గాల్లో కూడా ఈ సినిమా పై భారీగా క్రేజ్ ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా  నిర్మిస్తున్నారు.

ఉస్తాద్ భగత్ సింగ్ పై ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని వీలైతే ఓజీ చిత్రాన్ని పక్కనపెట్టి మరీ దీనికోసం వర్క్ చేయాలనుకుంటున్నారట. పవన్ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో మనమే కాదు.. ఆయనకు కూడా తెలియదు. అన్ని సినిమాల కంటే ముందుగా ఉస్తాద్ భగత్ సింగ్ పూర్తి చేయాలనుకుంటే.. ‘వీరమల్లు’ మరింత వెనక్కి వెళ్లే అవకాశం ఉంది. మరి.. పవర్ స్టార్ ఏం చేస్తారో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *