Monday, January 20, 2025
HomeTrending Newsఉత్తమ పాలకుడు ఎన్టీఆర్: బాబు

ఉత్తమ పాలకుడు ఎన్టీఆర్: బాబు

ఎన్టీఆర్ తోనే దేశ రాజకీయాల్లో సామాజిక, ఆర్ధిక మార్పులు వచ్చాయని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు.  దేశ రాజకీయాలకు ఓ దిశా నిర్దేశం చేసిన నాయకుడు కూడా ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. రాష్ట్ర చరిత్రలో ఉత్తమ పాలకుడు ఎన్టీఆర్ అయితే ఉత్తమ విధ్వంసకుడు ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని అభివర్ణించారు.  మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి బాబుతో పాటు ఆ పార్టీ నేతలు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో బాబు ప్రసగిస్తూ ఎన్టీఆర్  స్ఫూర్తి తోనే తెలుగుదేశం పార్టీ సాగుతోందన్నారు. మహిళలకు, బడుగు బలహీన వర్గాలకు అవకాశాలు కల్పించిన ఘనత టిడిపికి, ఎన్టీఆర్ కే దక్కుతుందన్నారు.  మహిళా విద్యను ప్రోత్సహిస్తూ తిరుపతిలో తొలి మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. ఎన్టీఆర్ శత జయంతి సంవత్సరంలో ఆయన పేరుమీద ఉన్న హెల్త్ యూనివర్సిటీ పేరు మర్చారని, గతంలో తాను తలచుకొని ఉంటె హార్టికల్చర్ యూనివర్సిటీ కి వైఎస్సార్ పేరును తొలగించి ఉండేవాడినని, కానీ తాను సిఎం జగన్ లాగా అలాంటి పిచ్చి  పనులు చేయబోమన్నారు.

“మహానటుడిగా, ప్రజానాయకుడిగా ఒకే జీవితంలో రెండు చరిత్రలు సృష్టించిన శకపురుషుడు ఎన్టీఆర్. ప్రజాహిత పాలనకు, సంక్షేమ పథకాలకు ఆద్యుడిగా… తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా… జాతీయ రాజకీయాలకు సరికొత్త దిశా నిర్దేశం చేసిన ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నివాళులు. రాజకీయాల్లో మహిళల, బడుగు వర్గాల ప్రాతినిధ్యాన్ని పెంచేందుకు, అట్టడుగు వర్గాలకు సంక్షేమాన్ని అందించేందుకు… మహిళలకు ఆస్తి హక్కు, బీసీలకు రిజర్వేషన్లు, రెండు రూపాయలకే కిలో బియ్యం వంటి పథకాలతో సమసమాజ స్థాపనకు బాటలు వేసిన ఎన్టీఆర్ ఆశయ సాధనకు మనందరం కృషిచేద్దాం” అని సామాజిక మాధ్యమాల్లో బాబు పోస్ట్ చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్