Saturday, April 20, 2024
Homeసినిమాచిరు బాటలో ఎన్టీఆర్..?

చిరు బాటలో ఎన్టీఆర్..?

చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’. ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల చేస్తున్నారు. అయితే.. ఈ సినిమాలో జాలరిగా నటించారు. ఈ పాత్రలో చాలా షేడ్స్ ఉంటాయి. జాల‌రి స్మ‌గ్ల‌ర్‌గా, గ్యాంగ్ స్ట‌ర్ గా మార‌డ‌మే ఈ సినిమా క‌థ‌. అయితే.. ఇప్పుడు ఎన్టీఆర్ కూడా జాలరి క్యారెక్టర్ చేస్తున్నాడని తెలిసింది. కొరటాల శివతో ఎన్టీఆర్ భారీ పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది.

ఈ సినిమాలోనూ… ఎన్టీఆర్ జాల‌రిగా క‌నిపించ‌బోతున్న‌ట్టు టాక్‌. ఆ పాత్ర‌లోనూ ఇలానే చాలా షేడ్స్ ఉంటాయ‌ట‌. కొర‌టాల శివ క‌థ‌ల‌న్నీ క‌మ‌ర్షియ‌ల్ వే. కాక‌పోతే వాటిలో ఓ సామాజిక నేప‌థ్యం ఉంటుంది. ఈసారి… స‌ముద్ర జ‌లాలు, క‌లుషిత నీరు.. ఇలా చాలా విషయాల గురించి చర్చించాలనుకుంటున్నాడట కొర‌టాల‌. ఎన్టీఆర్ పాత్ర‌, వాటి గెట‌ప్పులు కూడా ఆస‌క్తిక‌రంగా ఉంటాయ‌ని టాక్‌ వినిపిస్తోంది. ఈ చిత్రంలో క‌థానాయిక‌గా జాన్వీ క‌పూర్ పేరు గ‌ట్టిగా వినిపిస్తోంది. కానీ చిత్ర‌బృందం ఇంకా ఖ‌రారు చేయ‌లేదు.

ఈ సంక్రాంతికి… ఫ‌స్ట్ లుక్ గానీ, టైటిల్ గానీ విడుద‌ల చేసే అవ‌కాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. పిబ్రవరి నుంచి షూటింగ్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ యేడాదంతా కొర‌టాల శివ సినిమాతోనే ఎన్టీఆర్ బిజీ అవ్వ‌బోతున్నాడు. 2024లో ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుందని అఫిషియల్ గా అనౌన్స్ చేశారు. జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్, కొరటాల కలిసి చేస్తున్న సినిమా కావడం.. అలాగే ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. మరి.. ఎన్టీఆర్, కొరటాల కలిసి ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తారో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్