Monday, May 20, 2024
HomeTrending Newsఆస్కార్ నామినేషన్స్ లో 10 భారతీయ చిత్రాలు.

ఆస్కార్ నామినేషన్స్ లో 10 భారతీయ చిత్రాలు.

ఆస్కార్ అకాడమీ అవార్డుల వేడుక కోసం యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. మార్చిలో జరగనున్న ఈ వేడుక లో గతం కన్నా ఎక్కువ స్థాయిలో భారతీయ సినిమాలు నామినేషన్స్ ని దక్కించుకోవడం విశేషం. 2023 సంవత్సరానికి గాను ఇండియా నుంచి 10 సినిమాలు ఆస్కార్ నామినేషన్స్ కు అర్హత సాధించాయి. గుజరాతీ మూవీ ఛల్లో షో, ‘ఆర్ఆర్ఆర్‘ తో పాటు ఆ లిస్ట్ 10కి పెరగడం.. అందులో పలు క్రేజీ సినిమాలు వుండటంతో ఆస్కార్ పై ఆశలు మరింత పెరిగాయి.

ఇందులో వివేక్ అగ్నిహోత్రి రూపొందించిన ‘ది కశ్మీర్ ఫైల్స్’, రిషబ్ శెట్టి నటించి తెరకెక్కించిన ‘కాంతార’, కిచ్చా సుదీప్ నటించిన ‘విక్రాంత్ రోణ’ అలియా భట్ నటించిన ‘గంగూబాయి కతియా వాడీ’, ‘మి వసంతరావ్’, ‘తుజ్యా సాథీ కహీ హై’, ‘రాకెట్రీ’, ఇరవిన్ నిళల్ సినిమాలున్నాయి. ఇండియా నుంచి మొత్తం 10 సినిమాలు ఆస్కార్ కు ఎంట్రీని సాధించగా ప్రపంచ వ్యాప్తంగా 301 సినిమాలు ఆస్కార్ పురస్కారం కోసం పోటీపడుతున్నాయి.

95వ ఆస్కార్ అకాడమీ అవార్డ్స్ కు వివిధ కేటగిరీల్లో నామినేట్ అయిన సినిమాలని జనవరి 24న ప్రకటించనున్నారు. మార్చి 12న లాస్ ఏంజిల్స్ లో ఆస్కార్ వేడుక అట్టహాసంగా జరగనుంది. ఇదిలా వుంటే రీసెంట్ గా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన కాంతార రెండు విభాగాల్లో ఆస్కార్ కు నామినేట్ అయింది. కాంతార సినిమా ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు విభాగాల్లో ఆస్కార్ నామినేషన్లకు అర్హత సాధించినట్టుగా హొంబలే ఫిలింస్ సోషల్ మీడియా ద్వారా తెలియచేశారు. మరి.. ఈ పది చిత్రాల్లో ఏ సినిమా అయినా ఆస్కార్ అవార్డ్ గెలుచుకుంటుందేమో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్