Friday, March 29, 2024
Homeసినిమాఎన్టీఆర్, కొర‌టాల మూవీ ముహుర్తం ఫిక్స్?

ఎన్టీఆర్, కొర‌టాల మూవీ ముహుర్తం ఫిక్స్?

Muhurtum Soon: యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్.. బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌.. కాంబినేష‌న్లో రూపొందిన ‘జ‌న‌తా గ్యారేజ్’ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బ్లాక్ బ‌స్ట‌ర్ అవ్వ‌డం తెలిసిందే. దీంతో మ‌ళ్లీ వీళ్లిద్ద‌రి కల‌యిక‌లో సినిమా రావాల‌ని అభిమానులు ఎప్ప‌టి నుంచో కోరుకుంటున్నారు. అభిమానుల కోరిక‌ ఇప్ప‌టికి సెట్ అయ్యింది. ఈ క్రేజీ కాంబినేష‌న్లో మూవీని అనౌన్స్ చేసిన‌ప్ప‌టి నుంచి అభిమానులు ఎప్పుడెప్పుడు ఈ సినిమా సెట్స్ పైకి వ‌స్తుందా అని ఆతృత‌గా ఎదురు చూస్తున్నారు.

తాజా స‌మాచారం ప్ర‌కారం… ఫిబ్ర‌వ‌రి 7న ఈ చిత్రాన్ని పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభించేందుకు ముహుర్తం ఫిక్స్ చేశార‌ని తెలిసింది. మ‌రో విష‌యం ఏంటంటే… ఈ సినిమాలో ఎన్టీఆర్ స‌ర‌స‌న న‌టించేందుకు బాలీవుడ్ బ్యూటీ ఆలియా భ‌ట్ ను ఎంపిక చేశార‌ని తెలిసింది. కొర‌టాల సినిమా అంటే మ్యూజిక్.. రాక్ స్టార్ దేవిశ్రీప్ర‌సాద్ అందిస్తుంటారు. ఆచార్య సినిమాకి దేవిశ్రీని మార్చి మెలోడి బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ‌తో మ్యూజిక్ చేయించారు. ఇప్పుడు ఎన్టీఆర్ తో చేయ‌నున్న సినిమాకి యువ సంగీత సంచ‌ల‌నం అనిరుథ్ ర‌విచంద్ర‌న్ ని ఎంపిక చేసిన‌ట్టు స‌మాచారం. జ‌న‌తా గ్యారేజ్ సినిమాతో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించిన ఎన్టీఆర్, కొర‌టాల‌.. ఈ సినిమాతో ఏ రేంజ్ హిట్ సాధిస్తారో చూడాలి.

Also Read : ఎన్టీఆర్, కొర‌టాల మూవీ ఇంట్ర‌స్టింగ్ అప్ డేట్

RELATED ARTICLES

Most Popular

న్యూస్