Friday, June 12, 2026
Homeసినిమామరోసారి వాయిదాపడ్డ ఎన్టీఆర్ మూవీ

మరోసారి వాయిదాపడ్డ ఎన్టీఆర్ మూవీ

ఎన్టీఆర్.. కొరటాల శివతో సినిమా చేయాలి అనుకున్నారు. అయితే.. కొరటల శివ తెరకెక్కించిన ‘ఆచార్య’ డిజాస్టర్ అవ్వడంతో కథ పై కసరత్తు చేయమని చెప్పాడు. కథ పై పూర్తి స్థాయిలో సంతృప్తి చెందిన తర్వాత ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే.. ఈ సినిమాని ప్రకటించి చాలా రోజులు అయ్యింది కానీ.. ఇంత వరకు సెట్స్ పైకి వెళ్లలేదు. ఒకానొక దశలో ఎన్టీఆర్ అభిమానులు అసలు ఈ ప్రాజెక్ట్ ఉందా..? క్యాన్సిల్ అయ్యిందా..? అనే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం కూడా జరిగింది. అభిమానులు ఒత్తిడి మేరకు ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ఇస్తున్నారు మేకర్స్.

ఇటీవల అమిగోస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ప్రతి రోజు ఓ అప్ డేట్ ఇవ్వాలి అంటే కుదరదు. అభిమానులు అర్థం చేసుకోవాలి. అప్ డే్ట్ ఉంటే.. అందరి కంటే… ఇంట్లో పెళ్లాం కంటే ముందుగా అభిమానులకే చెబుతాం.. కొరటాల శివతో చేస్తున్న సినిమాను ఫిబ్రవరి 24న ప్రారంభిస్తాం. మార్చి నెల మూడవ వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తాం అని చెప్పారు. అయితే.. ఇప్పటికే ఈ చిత్రం స్టార్ట్ కావాల్సి ఉండగా, కొన్ని కారణాల వలన వాయిదా పడుతూ వస్తోంది. ఈ చిత్రం ప్రారంభోత్సవం ఈ నెల 24 వ తేదీన జరగాల్సి ఉంది కానీ.. తారకరత్న హఠాన్మరణం చెందడంతో మేకర్స్ ఈ ఈవెంట్ ను కాన్సిల్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

త్వరలో కొత్త తేదీని ప్రకటించనున్నారు. తాజా సమాచారం ప్రకారం.. జాన్వీ కపూర్ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తుందని తెలిసింది. అలాగే మృణాల్ ఠాకూర్ కూడా ఈ చిత్రంలో నటించనున్నట్లు సమాచారం. సంగీత సంచలనం అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్న ఈ భారీ పాన్ ఇండియా మూవీని యువ సుధ ఆర్ట్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ ల పై మిక్కిలినేని సుధాకర్, నందమూరి కళ్యాణ్‌ రామ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్ కు తారకరత్న అంటే చాలా ప్రేమ ఉండడంతో.. ఆయనకు ఆరోగ్యం బాగాలేదని తెలిసినప్పటి నుంచి చాలా బాధపడ్డారు. ఈ బాధ నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాతే ఈ సినిమాను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.

Also Read: ఎన్టీఆర్ డబుల్ రోల్ చేస్తున్నారా..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular