Friday, March 29, 2024
Homeసినిమాబుచ్చిబాబుకు షాక్ ఇచ్చిన ఎన్టీఆర్?

బుచ్చిబాబుకు షాక్ ఇచ్చిన ఎన్టీఆర్?

NTR-Buchhibabu: ఆర్ఆర్ఆర్ త‌ర్వాత యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కు పాన్ ఇండియా రేంజ్ లో ఇమేజ్ రావ‌డం తెలిసిందే. అందుక‌నే ఇక నుంచి చేసే సినిమాల విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకోవాలనుకుంటున్నార‌ని స‌మాచారం. అయితే.. ఆర్ఆర్ఆర్ త‌ర్వాత బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌తో సినిమా చేయ‌నున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమాను ఎప్పుడో ప్ర‌క‌టించారు. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటోంది. త్వ‌ర‌లో సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతోంది.

ఇదిలా ఉంటే.. ఇటీవ‌ల ఎన్టీఆర్ బాలీవుడ్ మీడియాకి ఇంట‌ర్ వ్యూ ఇచ్చారు. ఆ ఇంట‌ర్ వ్యూలో కొర‌టాల శివ‌తో చేయ‌నున్న సినిమా గురించి మాట్లాడుతూ… ఇది అన్ని కమర్షియల్ హంగులతో కూడిన ఇంటెన్స్ డ్రామా అని.. స్ట్రాంగ్ అండ్ ఇంటెన్స్ డ్రామాతో పాటు అభిమానులు కోరుకునే అంశాలన్నీ ఈ సినిమాలో ఉంటాయని తెలిపారు. ఇది డ్రామాతో నిండి ఉంటుంది. భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులను ఏకం చేసేది డ్రామా అని నేను నమ్ముతానని….  ఆర్ఆర్ఆర్ తర్వాత అభిమానులు, ప్రేక్షకులు ఏమి ఆశిస్తారో అన్ని అంశాలు ఈ సినిమాలో ఉంటాయని ఎన్టీఆర్ చెప్పారు. ఈ సినిమా త‌ర్వాత కేజీఎఫ్, స‌లార్ చిత్రాల ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ తో సినిమా చేయ‌నున్న‌ట్టుగా చెప్పారు. ఈ సినిమాలో కూడా ప‌వ‌ర్ ఫుల్ రోల్ చేస్తున్న‌ట్టుగా తెలియ‌చేశారు. అయితే.. ఎన్టీఆర్ కోసం ఎదురు చూస్తోన్న బుచ్చిబాబు సానాతో సినిమా గురించి మాత్రం ఏమీ చెప్ప‌లేదు. ఇది ఒక‌రంగా బుచ్చిబాబుకు షాకే అని చెప్ప‌చ్చు. మ‌రి.. బుచ్చిబాబుతో సినిమా గురించి ఎన్టీఆర్ త్వ‌ర‌లోనే క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

Also Read : ఎన్టీఆర్, కొర‌టాల మూవీ ముహుర్తం ఫిక్స్?

RELATED ARTICLES

Most Popular

న్యూస్