Sunday, September 8, 2024
Homeఅంతర్జాతీయంRussia: బెలారస్‌లో అణ్వస్త్ర క్షిపణుల మోహరింపు

Russia: బెలారస్‌లో అణ్వస్త్ర క్షిపణుల మోహరింపు

యుద్ధం మొదలై ఏడాది గడుస్తున్నా.. ఉక్రెయిన్‌ సంధి చర్చలకు రాకపోవటం, పశ్చిమ దేశాల దన్నుతో కయ్యానికి కాలు దువ్వటం రష్యాలో ప్రతీకారం మరింత పెంచుతోంది. ఖకోవ్కా ఆనకట్ట కూల్చివేత, మాస్కోపై క్షిపణుల దాడుల కారణంగా రష్యా-ఉక్రెయిన్‌ మధ్య జరుగుతున్న యుద్ధం ఉద్రిక్తంగా మారింది. దీనికి మరింత ఆజ్యం పోసే విధంగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఒక ప్రకటన చేశారు. జులై 7-8 తేదీల్లో బెలారస్‌లో అణ్వాయుధాలను మోహరిస్తామని వెల్లడించారు.

బెలారస్‌ అధ్యక్షుడు అలెగ్జాండర్‌ లుకషెంకోతో పుతిన్‌ శుక్రవారం సమావేశమయ్యారు. ‘ప్రతిదీ ప్రణాళిక ప్రకారం జరుగుతుంది. ప్రతిదీ స్థిరంగా ఉంది’ అని సమావేశం అనంతరం పుతిన్‌ ప్రకటన చేశారు. రష్యా అధీనంలో ఉండే భూ ఉపరితలం నుంచి సల్ప దూరంలోని లక్ష్యాలను చేధించే అణ్వస్త్ర క్షిపణులను బెలారస్‌లో మోహరించాలని గతంలోనే ఇద్దరు దేశాధ్యక్షులు నిర్ణయించారు.

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్