Monday, January 20, 2025
HomeTrending Newsఇండోనేషియా రాజధానిగా నుసంతర

ఇండోనేషియా రాజధానిగా నుసంతర

ఇండోనేషియా రాజధానిని జకర్తా నుంచి తరలించాలని ఆ దేశ ప్రభుత్వం నిర్ణయించింది. జకర్తా నుంచి వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉన్న బోర్నియో ఐల్యాండ్‌లోని నుసంతరకు రాజధానిని మార్చే పనిని వచ్చే ఏడాది నుంచే ప్రారంభించనుంది. జకర్తాలో పెరిగిపోయిన జనాభా, నగరానికి భౌగోళికంగా పొంచి ఉన్న ముప్పు కారణంగానే రాజధానిని మార్చాలని ఇండోనేషియా నిర్ణయించింది. వచ్చే ఏడాది ఆగస్ట్ 24వ తేది నుంచి అధికారికంగా నుసన్ తార రాజధానిగా ఉంటుంది. జకర్తాలో భూగర్భ జలాలను తోడుతుండటంతో ప్రమాదకర రీతిలో సగటున ఏడాదికి ఆరు సెంటీమీటర్లు మునిగిపోతున్నదని శాస్త్రవేత్తలు గుర్తించారు. వెంటనే తగు చర్యలు తీసుకోకపోతే 2050 నాటికి పావువంతు జకర్తా నగరం నీటమునిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

భూకంపాల ముప్పు కూడా జకార్తా నగరానికి ఎక్కువ. ప్రపంచంలో జనాభా ఎక్కువ ఉన్న నగరాల్లో జకర్తా ఒకటి. ఇక్కడ మూడు కోట్ల మంది ప్రజలు నివసిస్తున్నారు. ట్రాఫిక్‌, కాలుష్యంతో నగరం ఉక్కిరిబిక్కిరి అవుతున్నది. ఈ నేపథ్యంలో రాజధానిని నుసంతరకు మార్చాలని ఇండోనేషియా ప్రభుత్వం నిర్ణయించింది. ఇది భౌగోళికంగా సురక్షితమైన ప్రాంతంగా గుర్తించింది. నుసంతర ప్రపంచంలోనే అతి పురాతనమైన రెయిన్‌ఫారెస్ట్‌కు నెలవు. జనాభా కూడా 40 లక్షలు మాత్రమే ఉంది. దీంతో నుసంతరకు రాజధానిని మార్చేందుకు అక్కడి ప్రభుత్వం ఇప్పటికే 56,180 హెక్టార్లను గుర్తించింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్