Wednesday, March 19, 2025
HomeTrending NewsOBC: చట్టసభల్లో ఓబీసీలకు రిజర్వేషన్స్... ఢిల్లీలో ఆందోళన

OBC: చట్టసభల్లో ఓబీసీలకు రిజర్వేషన్స్… ఢిల్లీలో ఆందోళన

చట్టసభలలో ఓబీసీలకు రిజర్వేషన్స్ కల్పించాలని, ఇందుకు సంబంధించిన బిల్లును పార్లమెంటులో వెంటనే ప్రవేశపెట్టాలంటూ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, బడుగుల లింగయ్య యాదవ్ లు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.రాష్ట్రీయ ఓబీసీ మహాసంఘ్ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో మంగళవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వివిధ రాష్ట్రాలకు చెందిన పలువురు ఎంపీలు, నాయకులు, ఓబీసీలు ఆందోళనకు దిగారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఎంపీలు రవిచంద్ర, లింగయ్యలు మాట్లాడుతూ,లోకసభ, రాజ్యసభ,శాసనసభ,మండలి ఎన్నికలలో ఓబీసీలకు రిజర్వేషన్స్ కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.దేశ జనాభాలో వెనుకబడిన కులాలకు చెందిన వారు సుమారు 60శాతం మంది ఉన్నారని,అయితే చట్టసభలలో వీరి ప్రాతినిథ్యం మాత్రం చాలా తక్కువగా ఉండడం శోచనీయమన్నారు.రాజ్యాధికారంలో అన్ని కులాల వారికి సముచిత ప్రాధాన్యత ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం మరింత బలపడుతుందన్నారు.చట్టసభలలో ఓబీసీలు,మహిళలకు రిజర్వేషన్స్ కల్పించాలనే న్యాయమైన డిమాండ్స్ కు
బీఆర్ఎస్ సంపూర్ణ మద్దతునిస్తుందన్నారు.అలాగే, కేంద్రంలో ఓబీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని,ఉద్యోగులకు పదోన్నతులలో, ప్రైవేటు రంగంలో రిజర్వేషన్స్ ప్రవేశపెట్టాలని, ఇందుకు సంబంధించిన బిల్లులను పార్లమెంటులో వెంటనే ప్రవేశపెట్టాలని ఎంపీలు రవిచంద్ర, లింగయ్యలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్