Friday, April 19, 2024
HomeTrending Newsమార్గదర్శి కేసు: ఎండి శైలజకు నోటీసులు

మార్గదర్శి కేసు: ఎండి శైలజకు నోటీసులు

మార్గదర్శి చిట్ ఫండ్ కేసులో విచారణకు అందుబాటులో ఉండాలని ఆ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ చెరుకూరి శైలజకు ఆంధ్ర ప్రదేశ్ సిఐడి నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో ఆమె ఏ2గా ఉన్నారు. సిఐడి డిఎస్పీ రవి కుమార్ ఈ మేరకు నోటీసులు ఇస్తూ ఆమె ఆఫీస్ లేదా ఇంట్లో విచారిస్తామని, దీనికి సహకరించాలని సూచించారు. మార్చి  29, 31… ఏప్రిల్ 3, 6 తేదీల్లో ఆమెకు వెసులుబాటు ఉన్న తేదీ తెలియజేస్తే ఆరోజున విచారణకు వస్తామని వెల్లడించారు. మార్గదర్శి చిట్ ఫండ్ అక్రమాలు, నిధుల మళ్లింపు కేసులో సి ఐ డి విచారణ జరుపుతోంది. ఏ1 గా రామోజీరావు, ఏ2 గా చెరుకూరి శైలజ లను పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్