Sunday, November 3, 2024
HomeTrending Newsఒడిశా సిఎంగా గిరిజన నేత మోహన్ చరణ్ మాఝీ

ఒడిశా సిఎంగా గిరిజన నేత మోహన్ చరణ్ మాఝీ

ఒడిశా ముఖ్యమంత్రి ఎంపికలో బిజెపి మార్క్ రుజువైంది. అందరి అంచనాలకు భిన్నంగా గిరిజన నేత మోహన్ చరణ్ మాఝీని బిజెపి శాసనసభ పక్ష నేతగా ఎన్నుకున్నారు. మాఝీ ఒడిశా 15వ ముఖ్యమంత్రిగా బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

నూతనంగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేల సమావేశంలో శాసనసభా పక్ష నేతగా మోహన్‌ మాఝీని ఎన్నుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మోహన్‌ మాఝీ కెంజహార్‌ స్ధానం నుంచి బీజేడీ అభ్యర్ధి మినా మాఝీపై విజయం సాధించారు. అసెంబ్లీ ఎన్నికల్లో మోహన్‌ మాఝీ కెంజహార్‌ స్ధానం నుంచి బీజేడీ అభ్యర్ధి మినా మాఝీపై విజయం సాధించారు. 2000, 2004లో కూడా ఇదే నియోజకవర్గం నుంచే మోహన్ మాఝీ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు.

కనక్‌ వర్ధన్‌ సింగ్‌ దేవ్‌, ప్రవతి పరీద డిప్యూటీ సీఎంలుగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చీఫ్‌ నవీన్‌ పట్నాయక్‌ నేతృత్వంలోని బీజేడీ ఘోర పరాజయం పాలైన అనంతరం మోహన్‌ మాఝీ తొలి బీజేపీ సీఎంగా పాలనా పగ్గాలు చేపట్టనున్నారు.

ఒడిశాకు మూడో గిరిజన ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాజీ ఓడిశాకు దిశా నిర్దేశం చేయనున్నారు. గతంలో కాంగ్రెస్ నేత గిరిధర్ గమాంగ్ 292 రోజులు ముఖ్యమంత్రిగా భాద్యతలు నిర్వహించారు.

బిజేఎల్ పి సమావేశానికి కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, భూపేందర్‌ యాదవ్‌ పరిశీలకులుగా హాజరయ్యారు. 2000, 2004లో బీజేడీతో కలిసి సంకీర్ణ సర్కార్‌లో బీజేపీ భాగస్వామిగా ఉంది. ఒడిశాలో తొలిసారిగా బీజేపీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది.  బుధవారం సాయంత్రం భువనేశ్వర్‌లో జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ సహా పలు రాష్ట్రాల సీఎంలు, ప్రముఖులు హాజరు కానున్నారు.

మరోవైపు అరుణాచల్‌ ప్రదేశ్ బీజేఎల్పీ నాయకుడి ఎంపిక బాధ్యతలను బీజేపీ సీనియర్‌ నేతలు రవిశంకర్‌ ప్రసాద్‌, తరుణ్‌చుగ్‌లపై పెట్టింది. ఆ ఇద్దరిని కేంద్ర పరిశీలకులుగా నియమించింది. ఈ మేరకు బీజేపీ ప్రధాన కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. రేపో, ఎల్లుండో అరుణాచల్‌ బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశమై శాసనసభపక్ష నేతను ఎన్నుకోనున్నారు.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్