Wednesday, March 11, 2026
HomeTrending NewsCorona Virus: కరోనా కొత్త రూపం...అమెరికా పరిశోధనలు

Corona Virus: కరోనా కొత్త రూపం…అమెరికా పరిశోధనలు

మూడేళ్లు ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ మహమ్మారి ప్రస్తుతం అదుపులోనే ఉంది. భారత్ లో రోజూవారి కొత్త కేసుల్లో పెరుగుదల లేకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకుంటున్నారు. ఈ తరుణంలో కరోనా కొత్త వేరియంట్లు మరోసారి ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే ఈజీ. 5 వేరియంట్‌ అమెరికా, బ్రిటన్‌ సహా పలు దేశాల్లో వెలుగులోకి రాగా.. తాజాగా అమెరికాలో మరో కొత్త వేరియంట్‌ను అధికారులు గుర్తించారు.

కొవిడ్‌ 19కి చెందిన అత్యంత పరివర్తన చెందిన కొత్త వేరియంట్‌ను గుర్తించినట్లు అమెరికాకు చెందిన వ్యాధి నియంత్రణ కేంద్రం (Centers for Disease Control and Prevention) తెలిపింది. ఈ వేరియంట్‌కు బీఏ.2.86 (BA.2.86)గా పేరు పెట్టినట్లు పేర్కొంది. ఈ కొత్త వేరియంట్‌ అమెరికాతోపాటు ఇజ్రాయెల్‌, డెన్మార్క్‌ దేశాల్లో కూడా వెలుగులోకి వచ్చినట్లు తెలిపింది.

‘కొవిడ్‌-19కి చెందిన కొత్త వేరియంట్‌ను కనుగొన్నాం. దీనికి బీఏ.2.86 అని పేరు పెట్టాం. ఈ కొత్త వైరస్‌ యునైటెడ్‌ స్టేట్స్‌, డెన్మార్క్‌, ఇజ్రాయెల్‌లో కనుగొనబడింది. కొత్త వేరియంట్‌కు చెందిన పూర్తి సమాచారాన్ని సేకరిస్తున్నాం’ అని అమెరికా వ్యాధి నియంత్రణ కేంద్రం తెలిపింది.

మరోవైపు కొత్త వేరియంట్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కూడా స్పందించింది. బీఏ.2.86 అధిక సంఖ్యలో ఉత్పరివర్తనలు కలిగి ఉన్నందున దానిని ‘పర్యవేక్షణలో ఉన్న వేరియంట్’ గా పేర్కొన్నట్లు తెలిపింది. ఈ రకానికి చెందిన సీక్వెన్స్‌లు కొన్ని దేశాల్లో వెలుగు చూసినట్లు వెల్లడించింది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ డేటా ప్రకారం.. కొవిడ్‌-19 (Covid-19)కి కారణమయ్యే వైరస్‌ SARS-CoV-2తో సహా అన్ని వైరస్‌లు కాలక్రమేణా మారుతూ ఉంటాయి. అయితే, ఆ మార్పులు వైరస్‌ లక్షణాలపై ఎలాంటి ప్రభావం చూపవు. అయినప్పటికీ, వైరస్‌ ఎంత వేగంగా వ్యాప్తి చెందుతుంది, వ్యాధి తీవ్రత, వ్యాక్సిన్‌లు, చికిత్సా ఔషధాల పనితీరు వంటి కొన్ని మార్పులు వైరస్ లక్షణాలను ప్రభావితం చేయొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular