Sunday, September 29, 2024
HomeTrending Newsలోక్ సభ స్పీకర్ గా ఓం బిర్లా రెండోసారి ఎన్నిక

లోక్ సభ స్పీకర్ గా ఓం బిర్లా రెండోసారి ఎన్నిక

లోక్‌సభ స్పీకర్ గా ఓం బిర్లా రెండో సారి ఎన్నికయ్యారు. మూజువాణీ ఓటుతో ఆయన గెలుపొందినట్లు.. ఈ మేరకు ప్రోటెం స్పీకర్ భర్త్రుహరి మహతాబ్ ప్రకటించారు. రాజస్థాన్ లోని కోట నియోజకవర్గం నుంచి ఓం బిర్లా మూడోసారి ఎంపిగా ఎన్నికయ్యారు. ప్రధానమంత్రి నరేంద్రమోడి, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధి, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజులు ఓం బిర్లాను  తోడ్కొని స్పీకర్ స్థానం వద్దకు తీసుకొచ్చారు. స్పీకర్ గా ఎన్నికైన ఓం బిర్లాకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతిపక్ష నేత రాహుల్ సహా సభ్యులంతా ఆయనకు అభినందనలు తెలిపారు.

17వ లోక్ సభ స్పీకర్ గా బిర్ల సేవలందించారు. డిప్యూటీ స్పీకర్ లేకుండా ఐదేళ్ల పాటు పనిచేసిన స్పీకర్ గా ఓం బిర్లా రికార్డులకెక్కారు. గత ప్రభుత్వంలో ఎన్డీఏ కూటమి డిప్యూటీ స్పీకర్ ను ఎన్నుకోలేదు. లోక్ సభలో ఎన్డీఏ కూటమికి 293 మంది ఎంపీలు ఉండగా.. వైసీపీ కూడా మద్దతు పలకడంతో ఓం బిర్లాకు 297 మంది ఎంపీల సంఖ్యాబలం చేకూరింది. ఇండియా కూటమి తరఫున పోటీ చేస్తున్న కె. సురేశ్ కు 234 మంది ఎంపీలు మద్దతుగా ఉన్నారు.

లోక్ సభ స్పీకర్ పదవి అధికార పార్టీకే దక్కడం ఆనవాయితీ. ఎప్పటిలాగే స్పీకర్ పదవిని ఏకగ్రీవం చేసేందుకు ఎన్డిఏ ప్రభుత్వం ప్రయత్నించినా ఇండియా కూటమి పోటీకే మొగ్గుచూపింది… తమ అభ్యర్థిని బరిలోకి దింపింది. దీంతో అర్ధశతాబ్దం తర్వాత లోక్ సభ స్పీకర్ పదవికి ఎన్నికలు జరిగాయి. ప్రతిపక్ష ఇండియా కూటమి అభ్యర్థి కె.సురేష్ ఓటమి పాలయ్యారు.

-దేశవేని భాస్కర్

RELATED ARTICLES

Most Popular

న్యూస్