Omicron Is Not Danger :
ఓమిక్రాన్ వేవ్ చాలా ఉదృతంగా ఉంటుంది. అంటే కేసుల సంఖ్య బట్టి ఉదృతం. అంతే కానీ డేంజర్ కాదు. ఓమిక్రాన్ వల్ల ప్రాణ నష్టం ఉండదు. కేసులు పెరుగుతున్నప్పుడు భయపెట్టే ప్రచారానికి దూరంగా ఉండాలి. భయం పెరిగితే స్ట్రెస్ వస్తుంది. అది గుండెపోటుకు దారి తీయొచ్చు.
1 . ముంబై , ఢిల్లీ నగరాల్లో ఓమిక్రాన్ వేవ్ మొదలయ్యింది .
2 . తెలంగాణ లో కూడా కేసులు పెరగడం ప్రారంభం అయ్యింది .
ఎన్ని టెస్ట్ లు చేస్తారు అనే దాన్ని బట్టి కేసులు రోజుకు రెట్టింపు అవుతూ , జనవరి చివరి కల్లా లక్షల్లోకి చేరవచ్చు. ఓమిక్రాన్ ఎవరినీ వదలదు. అందరికీ సోకుతుందని వైద్య రంగ నిపుణులు అంటున్నారు. కేసులు పెరగడాన్నే వేవ్ అని చెప్పాలి అంటే వేవ్ అనుకోవచ్చు. కేసులైతే రోజుకు లక్షల్లో ఉంటాయి. కానీ ఆసుపత్రి కి వెళ్ళడాలు, అంబులెన్సు లు ఇలాంటివి కనబడవు. టెస్ట్ చేసుకోవాలి అంటే చేసుకోవచ్చు. చేసుకోకపోయినా నష్టం లేదు. రెండు మూడు రోజుల్లో లక్షణాలు తగ్గిపోతాయి.
ప్రపంచ వ్యాప్తంగా డేటా చూస్తే ..
- ఓమిక్రాన్ సోకిన వారిలో నూటికి తొంబై మందికి ఎలాంటి లక్షణాలు వుండవు. మిగతా పదిమందికి అతి స్వల్ప లక్షణాలు మాత్రమే ఉంటాయి. ఇది సూపర్ మైల్డ్
- ఓమిక్రాన్ చంపదు. ఎలాంటి మందులు వాడకుండానే లక్షలాది మంది ఓమిక్రాన్ సోకిన వారు కోలుకున్నారని దక్షిణాఫ్రికా డాక్టర్ లు తెలియచేసారు. తెలంగాణ ప్రభుత్వ డాక్టర్ లు ఓమిక్రాన్ రోగులకు కేవలం విటమిన్ మాత్రలు అంటే బి , సి , డి విటమిన్ మాత్రలు మాత్రమే ఇచ్చినట్టు చెప్పారు .
౩. జలుబు, గొంతులో గరగర, కొద్ది పాటి ఒంటి నలత దీని లక్షణాలు. కొంత మందికి ఒకటి రెండు రోజులు జ్వరం ఉండవచ్చు. రెండు మూడు రోజుల పాటు వేడి నీళ్లు తాగడం, గొంతులో గరగర ఆంటే సోర్ త్రోట్ తగ్గించడం కోసం వేడి నీళ్లలో ఉప్పు వేసి నోట్లో పోసుకొని తల పైకెత్తి గార్గిల్ చేయడం, వేడి పాలల్లో పసుపు వేసుకొని తాగడం లేదా అల్లం పసుపు కొద్ది పాటి సుగంధ ద్రవ్యాలతో చేసిన కషాయాన్ని రోజుకు ఒకటి లేదా రెండు సార్లు టీ లాగా తాగడం చెయ్యాలి. సాధారణంగా లక్షణాలు రెండు రోజుల్లో తగ్గిపోతాయి. జ్వరం ఉంటే డోలో 650 ఒకటి రెండు రోజులు వాడొచ్చు. తగ్గని పక్షం లో డాక్టర్ ను సంప్రదించవచ్చు. ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం ఉండదు. ఆక్సిజన్ అవసరం ఏర్పడదు. రుచి వాసన పోదు.
ఒక్క మాటలో చెప్పాలి అంటే ఇది జలుబు లాంటిది. ప్రోటీన్ ఎక్కువ ఉన్న ఆహారం తీసుకోండి. ఒకటి రెండు రోజులు విశ్రాంతి చాలు. దక్షిణ ఆఫ్రికా ప్రభుత్వం ఓమిక్రాన్ సోకినవారు ఇంట్లోనే ఉండాలి అనే రూల్ తీసేసింది. సోకినా బయటకు వెళ్లొచ్చు. అందరికీ టెస్ట్ లు చేయడం, ఒక వ్యక్తికి పాజిటివ్ వస్తే అతని కుటుంబ సబ్యులకు కూడా టెస్ట్ లు చేయడం లాంటివి అవసరం లేదని ఆ ప్రభుత్వం నిర్ణయించింది. ఇక్కడ మన ప్రభుత్వాలు ఎలాంటి నియమాలను తెస్తాయో చూడాలి. భాద్యత కలిగిన పౌరులుగా ప్రభుత్వ నియమాలను పాటిద్దాము. ఇలాంటివి మార్చ్ తరువాత ఇక ఉండవు.
వాసిరెడ్డి అమర్నాథ్, మెడికల్ ఆంత్రోపాలజీ నిపుణుడు
Also Read : విస్తరిస్తున్న ఓమిక్రాన్