‘ఏజెంట్’ ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడు..?

అక్కినేని అఖిల్ నటించిన తాజా చిత్రం ‘ఏజెంట్’. ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ భారీ చిత్రాన్ని అనిల్ సుంకర నిర్మించారు. ఇందులో మమ్ముట్టి కీలక పాత్ర పోషించడం విశేషం. భారీ అంచనాలో వచ్చిన ఏజెంట్ మాత్రం బాక్సాఫీస్ దగ్గర ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. భారీ డిజాస్టర్ గా నిలిచింది. అయితే.. ఏజెంట్ మూవీ డిజిటల్ రైట్స్ ను సోనీ లీవ్ సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని ఓటీటీలో మే 19న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అంతే కాకుండా ఓటీటీ రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించారు.

ఆతర్వాత ఏమైందో ఏమో కానీ.. ఏజెంట్ మూవీ ఓటీటీలోకి రాలేదు. ఇంతకీ విషయం ఏంటంటే.. ఓటీటీ ఆడియన్స్ కి మంచి ఎక్స్ పీరియన్స్ ఇవ్వడం కోసం కొన్ని సన్నివేశాలను ఎడిట్ చేస్తున్నట్టు తెలిసింది. అందుకే ఆలస్యం అయ్యిందట. సురేందర్ రెడ్డి దగ్గరుండి ఎడిటింగ్ చేయిస్తున్నారట. ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి థియేటర్లో సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎడిటింగ్ చేయడం ఏంటి..? అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారంజ జూన్ 23న ఏజెంట్ మూవీ ఓటీటీలోకి రానుందని తెలిసింది.

ఏజెంట్ వచ్చి వెళ్లిపోయింది కానీ.. అఖిల్ నెక్ట్స్ ఎవరితో అనేది ప్రకటించలేదు. అలాగే సురేందర్ రెడ్డి కూడా నెక్ట్స్ మూవీ ఎవరితో అనేది అనౌన్స్ చేయలేదు. అఖిల్ తదుపరి చిత్రం యువీ బ్యానర్ లో చేయనున్నట్టు వార్తలు వచ్చాయి కానీ.. అఫిషియల్ గా ప్రకటించలేదు. సురేందర్ రెడ్డి గీతా సంస్థలో సినిమా చేయనున్నట్టు టాక్ వచ్చింది కానీ.. ఎవరితో అనేది బయటకు రాలేదు. మరి.. త్వరలోనే అఖిల్ సినిమా గురించి, సురేందర్ రెడ్డి సినిమా గురించి క్లారిటీ వస్తుందేమో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *